Twitter Blue: వచ్చేవారాంతంలోగా మళ్లీ ‘బ్లూటిక్’ సబ్‌స్క్రిప్షన్
Twitter Blue: నకిలీ ఖాతాలను అరికట్టే క్రమంలో ట్విటర్ తాత్కాలికంగా బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌ను నిలిపివేసింది. దాన్ని తిరిగి ఎప్పుడు పునరుద్ధరిస్తానే ప్రశ్నకు మస్క్ తాజాగా ట్విరట్‌లో క్లారిటీ ఇచ్చారు.
వాషింగ్టన్: నకిలీ ఖాతాలు పెరిగిపోవడంతో నిలిపివేసిన ‘బ్లూటిక్’ సబ్‌స్క్రిప్షన్ సదుపాయాన్ని ఎప్పుడు పునరుద్ధరిస్తారనే ప్రశ్నకు మస్క్ బదులిచ్చారు. వచ్చేవారాంతంలోగా తిరిగి ట్విటర్ బ్లూ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తెలిపారు. మరోవైపు పేరడీ ఖాతాలు కలిగి ఉన్నవారు బయోలో కాకుండా పేరులోనే పేరడీ అనే పదాన్ని జత చేయాలని మస్క్ తెలిపారు. అలా ఉన్న ఖాతాలను పరోక్షంగా నకిలీవని అర్థం చేసుకోవచ్చని సూచించారు.
ఇంతకు మునుపు ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రముఖులు, జర్నలిస్టుల ట్విటర్ ఖాతాలను పరిశీలన చేసి ఈ బ్లూటిక్‌ను ఇచ్చేవారు. దీని వల్ల ఆ ఖాతా ఫలానా వారిదే అనే విషయంలో స్పష్టత ఉండేది. అయితే ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఈ ‘బ్లూటిక్’ విషయంలో ప్రీమియం సేవలను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం.. ఎటువంటి పరిశీలన లేకుండానే నెలకు 8 డాలర్లు చెల్లించి బ్లూటిక్‌ను పొందే వీలుంది. దీంతో కొంత మంది ప్రముఖులు, సంస్థల పేరిట నకిలీ ఖాతాలు తెరిచి కొందరు సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఏది అధికారిక ఖాతానో, ఏదీ నకిలీ ఖాతానో అనే విషయంలో గందరగోళం నెలకొంది. ఈ పరిణామంపై పలువురు ఆందోళన వ్యక్తం చేయడంతో ట్విటర్ ప్రస్తుతానికి ఈ సేవలను ఆపేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!