Updated : 06 May 2022 17:27 IST

Sukanya sammrdhi yojana: సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతా ఎక్క‌డ‌... ఎలా తెర‌వాలి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: 10 ఏళ్ల లోపు బాలిక‌ల‌కు పోస్టాఫీసులో గానీ, బ్యాంకులో గానీ సుక‌న్య స‌మృద్ధి యోజ‌న (SSY) ఖాతాను త‌ల్లిదండ్రులు/స‌ంర‌క్షులు ఎవ‌రైనా తెర‌వొచ్చు. ఈ ప‌థ‌కానికి ఇత‌ర డిపాజిట్ల ప‌థ‌కాల‌ క‌న్నా వ‌డ్డీ రేటు ఎక్కువ‌. ప్ర‌స్తుతం వ‌డ్డీ రేటు 7.6% శాతంగా ఉంది. 10 ఏళ్ల‌లోపు బాలిక‌ల కోసం ప్ర‌భుత్వం 2014లో ఈ ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్ట‌డానికి ఒక సంవ‌త్స‌రంలో క‌నీస మొత్తం రూ.250, గ‌రిష్ఠంగా  రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టొచ్చు.

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతాను తెర‌వాలంటే..?

బ్యాంకు ద్వారా..

 • మీ స‌మీప బ్యాంకులో సుక‌న్య స‌మృద్ధి యోజ‌న దర‌ఖాస్తు ఫార‌ంను పూరించండి. దీనిని ఫార‌మ్ SSA-1 అంటారు. ఈ దర‌ఖాస్తు ఫార‌మ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని కూడా పూరించొచ్చు.
 • మీరు ఖాతాను తెర‌వాల‌నుకుంటున్న బాలిక జ‌న‌న ధ్రువీకరణ ప‌త్రం, త‌ల్లిదండ్రులు/ స‌ంర‌క్షుల గుర్తింపు రుజువుగా ఆధార్ కార్డ్‌, పాన్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి.
 • చిరునామా రుజువుగా డ్రైవింగ్ లైసెన్స్‌, టెలిఫోన్ బిల్లు, విద్యుత్‌ బిల్లు ఏదో ఒక‌టి జిరాక్స్ ఇవ్వాలి.
 • క‌నిష్ఠంగా రూ.250 నుంచి రూ.1.5 ల‌క్ష‌ల గ‌రిష్ఠ ప‌రిమితి వ‌ర‌కు డిపాజిట్ చేయొచ్చు.
 • అన్ని ప‌త్రాల‌తో పాటు మీ దర‌ఖాస్తుని ప్రాసెస్ చేయ‌డానికి బ‌్యాంకుకు స్వ‌ల్ప దినాలు స‌మ‌యం ప‌ట్టొచ్చు.
 • దర‌ఖాస్తు ధ్రువీకరణ త‌ర్వాత మీ SSY ఖాతా ఓపెన్‌ అవుతుంది. మీకు పాస్‌బుక్ జారీ అవుతుంది. మీరు డిపాజిట్ చేసిన‌ప్పుడ‌ల్లా కౌంట‌ర్ రీసీట్ తీసుకుని పాస్‌బుక్‌లో ఎంట్రీలు వేయించుకోవాలి.

పోస్టాఫీసు ద్వారా.. 

 • పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంకు అందించిన ప్రారంభ ఖాతా ఫార‌మ్‌ని పూరించి స్వ‌యంగా అందించాలి.
 • మీరు ఖాతాను తెర‌వాల‌నుకుంటున్న బాలిక జ‌న‌న ధ్రువీకరణ ప‌త్రం, త‌ల్లిదండ్రులు / స‌ంర‌క్షుల గుర్తింపు రుజువుగా ఆధార్ కార్డ్‌, పాన్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి.
 • చిరునామా రుజువుగా డ్రైవింగ్ లైసెన్స్‌, టెలిఫోన్ బిల్లు, విద్యుత్‌ బిల్లు ఏదో ఒక‌టి జిరాక్స్ ఇవ్వాలి.
 • మొద‌ట‌గా క‌నిష్ఠంగా రూ.250 నుంచి రూ.1.5 ల‌క్ష‌ల గ‌రిష్ఠ ప‌రిమితి వ‌ర‌కు డిపాజిట్ చేయొచ్చు.
 • మీ స‌మీపంలోని పోస్టాఫీసును సంప్ర‌దించి అక్క‌డే దర‌ఖాస్తు ఫార‌మ్‌ను, ఇత‌ర జిరాక్స్ కాపీలను స్వ‌యంగా అందించాలి.
 • అన్ని ప‌త్రాల‌తో పాటు మీ దర‌ఖాస్తుని ప్రాసెస్ చేయ‌డానికి పోస్టాఫీసుకు స్వ‌ల్ప దినాలు వ‌ర‌కు గ‌డువు ప‌ట్ట‌వ‌చ్చు.
 • బ్యాంక్‌లో, పోస్టాఫీసులో జిరాక్స్‌లు అంద‌జేసేటప్పుడు ఒరిజిన‌ల్ ప‌త్రాలు అన్నీ కూడా బ్రాంచ్‌ సిబ్బంది అడిగితే చూపించాల్సి ఉంటుుంది.

ఆన్‌లైన్‌లో..

 • IPPB (ఇండియ‌న్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌) యాప్‌ను డౌన‌లోడ్ చేయండి. IPPB అనేది భార‌తీయ పోస్టుకు సంబంధించిన విభాగం. మీరు https://www.ippbonline.com/ లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
 • మీ ప్ర‌స్తుత బ్యాంకు ఖాతా నుంచి డ‌బ్బును మీ IPPB ఖాతాకు బ‌దిలీ చేయండి.
 • ఇప్పుడు DOP Product విభాగాన్ని గుర్తించండి. SSY ఖాతా లింక్‌పై క్లిక్ చేయండి.
 • DOP క‌స్ట‌మ‌ర్ ఐడీతో పాటు మీ SSY ఖాతా సంఖ్య‌ను న‌మోదు చేయండి.
 • మీ SSY ఖాతాకు డిపాజిట్ చేయాల‌నుకుంటున్న మొత్తాన్ని, వ్య‌వ‌ధిని ఎంచుకోండి.
 • SSY ఖాతాకు విజ‌య‌వంతంగా బ‌దిలీకి IPPB నుంచి నిర్ధార‌ణ కోసం వేచి ఉండండి.
 • అనంత‌రం చెల్లింపు విజ‌య‌వంత‌మైన‌ట్లు నిర్ధార‌ణ అవుతుంది.
Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని