కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే ఏంటి?

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంకులు ఆఫ‌ర్ చేస్తాయి. బ్యాంకు పొదుపు ఖాతాల కంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గా ఉంటాయి. కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను, కంపెనీలు ఆఫ‌ర్ చేస్తాయి. కంపెనీల‌కు డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ప్ర‌క‌టిస్తాయి, ఆక‌ర్ష‌ణీయ‌మైన వ‌డ్డీ రేట్లు అందిస్తాయి. వేర్వేరు కాల‌ప‌రిమితో కూడిని ఖాతాలు ఉంటాయి. డిపాజిట్ చేసినందుకు హామీగా డిపాజిట్ స‌ర్టిఫికెట్ల‌ను అందిస్తాయి...

Published : 16 Dec 2020 16:46 IST

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంకులు ఆఫ‌ర్ చేస్తాయి. బ్యాంకు పొదుపు ఖాతాల కంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గా ఉంటాయి. కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను, కంపెనీలు ఆఫ‌ర్ చేస్తాయి. కంపెనీల‌కు డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ప్ర‌క‌టిస్తాయి, ఆక‌ర్ష‌ణీయ‌మైన వ‌డ్డీ రేట్లు అందిస్తాయి. వేర్వేరు కాల‌ప‌రిమితో కూడిని ఖాతాలు ఉంటాయి. డిపాజిట్ చేసినందుకు హామీగా డిపాజిట్ స‌ర్టిఫికెట్ల‌ను అందిస్తాయి.

వ‌డ్డీ రేట్లు ఎలా?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్‌, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 7 శాతం వ‌ర‌కు వ‌డ్డీ రేట్ల‌ను ఇస్తున్నాయి. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవ‌న్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 9 శాతం వ‌డ్డీని అందిస్తున్నాయి. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గా ఉంటాయి. కాల‌పరిమితిని బ‌ట్టి వ‌డ్డీ రేట్ల‌ను నిర్ణ‌యిస్తారు.

కంపెనీలు వివిధ (1-5) సంవ‌త్స‌రాల వ‌ర‌కు వివిధ‌ కాల‌ప‌రిమితులకు వేర్వేరు వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తాయి. వ‌డ్డీ రేట్లు 9.25 శాతం నుంచి 10.75 శాతం వ‌ర‌కు ఉంటుంది. త‌క్కువ రేటింగ్ ఉన్న కంపెనీలు ఎక్కువ వ‌డ్డీ రేట్ల‌ను ఆఫ‌ర్ చేస్తాయి. ఎక్కువ‌గా వ‌డ్డీ రేట్లు ఇచ్చే కంపెనీల కంటే క్రెడిట్ రేటింగ్ ఎక్కువ‌గా ఉన్న కంపెనీల‌ను ఎంచుకోవ‌డం మంచిద‌ని ఆర్థిక విశ్లేష‌కులు చెప్తున్నారు.

రిస్క్ ఎంత‌?

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వ‌హ‌ణ‌లో ఉంటాయి. బ్యాంక్ దివాలా తీసినా, ఎలాంటి సంద‌ర్భంలో అయినా ఈ ల‌క్ష రూపాయ‌లు ఇచ్చేందుకు ఆర్‌బీఐ హామీ ఉంటుంది.

కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎలాంటి భ‌ద్ర‌త హామీ ఉండ‌దు. కంపెనీకి ఒకవేళ న‌ష్టాలు వ‌స్తే, స‌రైన నిధులు లేక‌పోతే వ‌డ్డే రేట్లు చెల్లించ‌క‌పోవ‌చ్చు. మీ డిపాజిట్‌ను కూడా తిరిగి ఇచ్చే ప‌రిస్థిత‌లో లేక‌పోవ‌చ్చు. అందుకే కార్పొరేట్ డిపాజిట్లు రిస్క్‌తో కూడుకున్న‌వి. ఇది దృష్టిలో పెట్టుకునే కంపెనీలు ఎక్క‌వ వ‌డ్డీ రేట్ల‌ను ఇస్తాయి. ఎంత రిస్క్ ఉంటే అంత ఎక్కువ వ‌డ్డీ రేట్లు ప్ర‌క‌టిస్తాయి. అయితే కేర్, క్రిసిల్ లాంటి కొన్ని రేటింగ్ సంస్థలు కంపెనీ డిపాజిట్లకు రేటింగ్ అందిస్తాయి. AAA రేటింగ్ ఉన్న డిపాజిట్లకు రిస్క్ కాస్త తక్కువ ఉంటుంది.

ప‌న్ను ఎలా వర్తిస్తుంది?

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఐదేళ్లు, ప‌దేళ్లు కాల‌ప‌రిమితి క‌లిగిన‌వాటికి సెక్ష‌న్ 80 సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. లాక్‌-ఇన్‌-పీరియ‌డ్ ముగియ‌క‌ముందే విత్‌డ్రా చేసుకునేందుకు వీల్లేదు. ముందుగా తీసుకునేందుకు వీలున్న ఖాతాల‌కు కూడా తీసుకుంటే ప‌న్ను మిన‌హాయింపు ల‌భించ‌దు. వ‌డ్డీ ఆదాయం రూ.10 వేలు మించితే టీడీఎస్ వ‌ర్తింప‌జేస్తుంది. సీనియ‌ర్ సిట‌జ్ల‌కు రూ.50వేల వ‌ర‌కు ఉంది.

కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో టీడీఎస్ వ‌డ్డీ ఆదాయం రూ.5 వేల‌కు మించితే వ‌ర్తిస్తుంది. అయితే క్యాపిట‌ల్‌పై ఎలాంటి ప‌న్ను ఉండ‌దు. కార్పొరేట్ ఎఫ్‌డీల‌లో ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తించ‌దు.

ముంద‌స్తు విత్‌డ్రాకి వీలుందా?

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో ముందుస్తుగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు,కానీ వ‌డ్డీ రేటుపై 2 శాతం రుసుములు చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. కొన్ని కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ముంద‌స్తు విత్‌డ్రాల‌కు అనుమ‌తినివ్వ‌వు. ఒక‌వేళ తీసుకున్నా వ‌డ్డీ రేట్లు అందించ‌రు. ఆరు నుంచి 12నెల‌ల త‌ర్వాత విత్‌డ్రా చేసుకుంటే ఆఫ‌ర్ చేసిన వ‌డ్డీ రేటు నుంచి 2-3 శాతం వ‌డ్డీని త‌గ్గిస్తాయి.

bf.jpg

ఇంత‌కీ ఏది మంచిది ?

కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో దీర్ఘ‌కాలం కంటే స్వ‌ల్ప కాలానికి పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచింది. ఎందుకంటే దీర్ఘ‌కాలంలో కంపెనీ ప‌నితీరు ఎలా ఉంటుందో అంచ‌నా వేయలేం. అందుకే త‌క్కువ కాలం పెడితే సుర‌క్షితంగా ఉంటాయి. ఎంతైనా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో ఉన్నంత హామీ ఇక్క‌డ ఉండదనే నిపుణులు చెప్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు