Updated : 11 Jul 2022 14:42 IST

ITR Filing: ఐటీ రిటర్నులు ఫైల్‌ చేస్తున్నారా? ఏ ఫారం ఎవరికో తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్: గత ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను ఆదాయపు పన్ను రిటర్నులు ఈ నెలాఖరులోగా దాఖలు చేయాలి. చివరి నిమిషంలో హడావుడి పడకుండా.. ముందే రిటర్నులు సమర్పించడం ఎంతో అవసరం. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌) ఈ గడువు వరిస్తుంది. ఫారం-16, టీడీఎస్‌ సర్టిఫికెట్లు, మూలధన రాబడి వివరాలు, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు, ఫారం 26ఏఎస్‌, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)లన్నీ ఒకసారి పరిశీలించుకోవాలి. ఆదాయం, పన్ను చెల్లింపు, జమల్లో ఏదైనా తేడాలున్నాయా గమనించాలి. చాలామంది తమ రిటర్నులను దాఖలు చేసేందుకు ఏ ఫారం వినియోగించాలని సందేహిస్తుంటారు. ఏ ఫారం ఎవరికి వర్తిస్తుంది.. ఎవరు ఉపయోగించకూడదో తెలుసుకొందాం..!
Also Read: మీ సంస్థ ఇంకా ఫారం 16 ఇవ్వ‌లేదా? అయినా రిట‌ర్నులు దాఖ‌లు చేయండిలా..!

ఐటీఆర్‌-1 లేదా సహజ్‌..

 • భారతీయ పౌరులై, రూ.50లక్షల లోపు ఆదాయం ఉన్నవారు
 • వేతనం ద్వారా ఆదాయం, ఒక ఇంటి నుంచి ఆదాయం పొందుతున్నవారు
 • ఇతర మార్గాల ద్వారా (వడ్డీ) ఆదాయంలాంటివి ఉన్నప్పుడు (లాటరీ, గుర్రపు పందేల్లో గెలుచుకున్న ఆదాయం ఉంటే ఐటీఆర్‌-1 వర్తించదు)

ఐటీఆర్‌-2..

 • ఆదాయం రూ.50 లక్షలు దాటితే
 • ఐటీఆర్‌ -1 ఫారం వర్తించని వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUF)
 • డివిడెండ్లు, ఇతర ఆదాయాలు వచ్చిన వారు (లాటరీ, గుర్రపు పందేల్లో గెలుచుకున్న ఆదాయం కూడా)
 • ఒక ఇంటికి మించి ఇళ్ల ద్వారా ఆదాయం ఉన్న సందర్భంలో
 • ఓ కంపెనీకి వ్యక్తిగత డైరెక్టర్‌ హోదాలో ఉంటే
 • నమోదుకాని కంపెనీ ఈక్విటీ షేర్లలో పెట్టుబడులు పెట్టినట్లయితే
 • మూలధన లాభాలు, విదేశీ ఆదాయం ఉన్నట్లయితే

ఐటీఆర్‌-3..

 • వ్యాపారం, వృత్తి ద్వారా ఆదాయం ఆర్జించే వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు
 • పన్ను వర్తించే ఆదాయం రూ.50లక్షలు దాటినప్పుడూ
 • క్యాపిటల్‌ గెయిన్స్‌ ఉన్నవారూ..
 • ఒక సంస్థలో భాగస్వామిగా ఉంటూ ఆదాయం ఆర్జిస్తున్నట్లయితే..
 • ఒక్క ముక్కల్లో చెప్పాలంటే ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-2, ఐటీఆర్-4 వర్తించనివారు ఐటీఆర్‌-3ని ఉపయోగించుకోవాలి.

ఐటీఆర్‌-4 లేదా సుగమ్‌..

 • వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, భాగస్వామ్య సంస్థలు సెక్షన్‌ 44AD లేదా 44AE ప్రకారం అంచనా ఆధారంగా ఆదాయాన్ని పేర్కొనే వారు
 • వేతనం లేదా పింఛను ద్వారా రూ.50 లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తున్నవారు
 • ఒక ఇంటి నుంచి రూ.50 లక్షలకు మించని ఆదాయం ఉన్నవారు
 • ఇతర ఆదాయ మార్గాల ద్వారా రూ.50 లక్షలు మించకుండా ఆర్జిస్తున్నవారు (లాటరీ, గుర్రపు పందేల్లో గెలుచుకున్న ఆదాయం ఉంటే ఈ ఫారం వర్తించదు)

ఐటీఆర్‌-5..

ఈ ఫారం కంపెనీలు, ఎల్‌ఎల్‌పీ (Limited Liability Partnership), ఏఓపీలు (Association of Persons), బీఓఐలు (Body of Individuals), ఆర్టిఫీషియల్‌ జురిడికల్‌ పర్సన్‌ (AJP), ఎస్టేట్‌ ఆఫ్‌ డిసీజ్డ్‌, ఎస్టేట్‌ ఆఫ్‌ ఇన్‌సాల్వెంట్‌, బిజినెస్‌ ట్రస్ట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ విభాగాల పరిధిలోకి వచ్చేవారు సమర్పించాలి.

ఐటీఆర్ ఫారం-6..

సెక్షన్‌ 11 (ఛారిటీ, మతపరమైన అవసరాల కోసం ఉన్న ఆస్తి ద్వారా లభించిన ఆదాయం) కింద మినహాయింపు కోరని కంపెనీలు ఈ ఫారంను ఉపయోగించుకోవాలి. దీన్ని కచ్చితంగా ఎలక్ట్రానిక్‌ రూపంలోనే దాఖలు చేయాలి.

ఐటీఆర్ ఫారం-7..

సెక్షన్‌ 139 (4ఏ), 139 (4బీ), 139 (4సీ), 139 (4డీ), 139 (4ఈ), 139 (4ఎఫ్‌) ప్రకారం రిట‌ర్నులు దాఖ‌లు చేసే వ్యక్తులు, కంపెనీల‌కు ఈ ఫారం వ‌ర్తిస్తుంది. ట్రస్టులు, రాజకీయ పార్టీలు, సంస్థలు, కళాశాల‌లు, మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థలు దీని పరిధిలోకి వ‌స్తాయి.

ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడం ఒక్కటే కాదు.. వాటిని సరైన ఫారాల్లోనే దాఖలు చేయాలి. లేకపోతే అవి చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని