మ‌దుప‌ర్ల ఆలోచ‌న‌లెలా ఉంటాయంటే

బిహేవియ‌ర‌ల్ ఫైనాన్స్ ప్ర‌కారం మీరు తీసుకునే పెట్టుబ‌డి నిర్ణ‌యాల‌ను బ‌ట్టి కింది వాటిలో ఏ కేట‌గిరిలోకి వ‌స్తారో తెలుసుకోవ‌చ్చు​​​​​​....

Published : 19 Dec 2020 10:43 IST

బిహేవియ‌ర‌ల్ ఫైనాన్స్ ప్ర‌కారం మీరు తీసుకునే పెట్టుబ‌డి నిర్ణ‌యాల‌ను బ‌ట్టి కింది వాటిలో ఏ కేట‌గిరిలోకి వ‌స్తారో తెలుసుకోవ‌చ్చు​​​​​​​

మ‌దుప‌ర్లు తీసుకునే నిర్ణ‌యాల‌ను బ‌ట్టి వారిని కొన్ని కేట‌గిరీల‌కు చెందిన వారిగా గుర్తించొచ్చు. బిహేవియ‌ర‌ల్ ఫైనాన్స్ ప్ర‌కారం నాలుగు ర‌కాల మ‌దుప‌ర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మీరే కేట‌గిరీలోకి వ‌స్తార‌నేది తెలుసుకోవ‌చ్చు. భ‌విష్య‌త్తు కోసం ఆలోచించే ప్ర‌తీ ఒక్క‌రూ ఎంతో కొంత మొత్తం పెట్టుబ‌డి చేస్తుంటారు. అది మ్యూచువ‌ల్ ఫండ్లు, షేర్లు, బాండ్లు ఏదైనా గానీ కావొచ్చు. మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యానికి అనుగుణంగా పెట్టుబ‌డి సాధానాల‌ను ఎంపిక చేసుకోవాలి. అయితే మ‌దుప‌ర్లు వారు తీసుకునే నిర్ణ‌యాల‌ను బ‌ట్టి వారిని కొన్ని కేట‌గిరీల‌కు చెందిన వారిగా గుర్తించొచ్చు. నాలుగు ర‌కాల మ‌దుప‌ర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మీరే కేట‌గిరీలోకి వ‌స్తార‌నేది తెలుసుకోవ‌చ్చు. బిహేవియ‌ర‌ల్ ఫైనాన్స్ లో ఈ అంశాలు ఉంటాయి.

ర‌క్ష‌ణాత్మ‌క ధోర‌ణి:

పెట్టుబ‌డుల‌ను చాలా జాగ్ర‌త్త‌గా చూసుకుంటారు. త‌మ పెట్టుబ‌డులు ఏ విధంగా ఉన్నాయ‌నే దాన్ని నిరంత‌రం ప‌రిశీలిస్తుంటారు. వీరికి న‌ష్ట‌భ‌యం కాస్త ఎక్క‌వ‌గా ఉంటుంది. సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డుల‌ను ఎంపిక చేసుకునేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. వీరు త‌మ పెట్టుబడి న‌ష్టం రాకూడ‌ద‌నే ఆలోచ‌న క‌లిగి ఉండ‌టం వ‌ల్ల కొన్ని సార్లు వృద్ధికి ఆస్కారం ఉన్న పెట్టుబ‌డుల‌ను చేయ‌క‌పోవ‌చ్చు.

వీరు ర‌క్ష‌ణ ఉండే పెట్టుబ‌డులు అధిక‌శాతం చేసి స్వ‌ల్ప శాతం వృధ్ధి చెందే వాటిలో పెట్టుబ‌డి చేయాలి. ఈ అంశంలో వ్య‌క్తులు త‌మ‌ ఆర్థిక అవ‌స‌రాలు వ‌య‌సు న‌ష్ట‌భ‌యం త‌దిత‌ర అంశాల ఆధారంగా నిర్ణ‌యం తీసుకోవాలి. దీనికి రిస్క్ ప్రొఫైల‌ర్ చాలా మంచి ఎంపిక‌. ఇది ప్ర‌శ్న‌జ‌వాబుల రీతిలో ఉంటుంది. ఇది దాదాపుగా అన్ని పెట్టుబ‌డి నిర్వ‌హ‌ణ సంస్థ‌లు త‌మ వెబ్‌సైట్ల‌లో అందుబాటులో ఉంచుతాయి…

పెంచుకునే ధోర‌ణి:

వీలైనంత వ‌ర‌కూ, అవ‌కాశం దొరికినంత వ‌ర‌కూ పెట్టుబ‌డుల‌ను చేయ‌డ‌మే వీరి ల‌క్ష్యం. వీరికి త‌మ నిర్ణ‌యాల‌పై విశ్వాసం ఎక్కువ‌గా ఉంటుంది. అయితే ఎక్కువ కాలం పాటు పెట్టుబ‌డి కొన‌సాగించే ధోర‌ణిలో ఉంటారు కాబ‌ట్టి వీరికి దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డిని ఆర్జిస్తార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ ధోర‌ణి క‌లిగిన మ‌దుప‌ర్లు పాటించే దీర్ఘ‌కాలం పాటు పెట్టుబ‌డి చేయ‌డం మంచి నిర్ణ‌యం.

పెట్టుబ‌డులు ఎక్కువగా చేస్తుంటారు కాబ‌ట్టి స‌రైన సాధ‌నాల‌ను ఎంపిక చేసుకోవాలి. వృధ్ధి,విలువ రెండు ల‌క్ష‌ణాలు ఉన్న పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి. ఎందుకంటే త‌ప్పు పెట్టుబ‌డి ఎంచుకునే దాంట్లోనే పెట్టుబ‌డి చేసుకుంటూ పోతే ఆశించిన రాబ‌డి రాక‌పోవ‌డం జ‌ర‌గొచ్చు.

అనుక‌రించే ధోర‌ణి:

పెట్టుబ‌డుల విష‌యంలో ఇత‌రుల‌ను చూసి అనుస‌రించే విధానం వీరికి ఉంటుంది. ఇత‌రులు ఏయే పెట్టుబ‌డుల‌ను చేస్తున్నారో గ‌మ‌నించి వారి లాగే పెట్టుబ‌డుల‌ను చేస్తుంటారు. ఈ ధోర‌ణి క‌లిగి ఉండే మ‌దుప‌ర్లు విశ్వ‌స‌నీయ‌మైన వాటిని అనుస‌రించ‌డం ద్వారా కొంద‌రి కంటే ముందుగా మార్కెట్ లో జ‌రిగే మార్పుల‌ను ప‌ట్టుకుంటారు.

అయితే వీరు అనుక‌రించే ప‌ద్ధ‌తులు విశ్వ‌నీయ‌త క‌లిగిన‌విగా ఉండాలి. సాధార‌ణంగా వీరు ఫండ్ మేనేజ‌ర్లు, విశ్లేష‌కులు చెప్పే అంశాల ఆధారంగా నిర్ణ‌యం తీసుకుంటారు. వీరు ఏం చేయ‌కూడదంటే ఎవ‌రుప‌డితే వారిని అనుక‌రించి, వాళ్లు వీళ్లు చెప్పార‌ని గుడ్డ‌గా పెట్టుబ‌డులు చేయ‌రాదు.

స్వ‌తంత్రం ధోర‌ణి:

పెట్టుబ‌డి నిర్ణ‌యాలు స్వ‌త‌హాగా తీసుకుంటారు. ఇత‌రుల‌తో సంబంధం లేకుండా త‌మ‌కు న‌మ్మ‌క‌మైన పెట‌టుబ‌డుల‌ను ఎంచుకుంటారు. అయితే స్వ‌త‌హాగా పెట్టుబ‌డి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల్ల న‌ష్టం లేదు కానీ తీసుకునే నిర్ణ‌యాలు క‌చ్చితంగా ఉండాలా చూసుకోవాలి. వీరు కాస్త అవ‌గాహ‌న‌, అనుభ‌వం క‌లిగి ఉంటారు. ముందుగా త‌గు విశ్లేష‌ణ చేసే రంగంలోకి దిగుతారు. వీరు కూడా సంప‌ద‌ను పెంచుకునే ధోర‌ణి వారికి స‌మానంగానే వ్య‌హ‌రిస్తారు.

వీరు ఏం చేయ‌కూడ‌దంటే త‌మ‌పై త‌మ‌కు ఉండే విశ్వాశాన్ని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవాలి. వాస్త‌వ ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణ‌యాలు తీసుకోవాలి. అతి విశ్వాసం అస‌లుకే న‌ష్టాన్ని క‌లిగించే అవ‌కాశం ఉండొచ్చు కాబ‌ట్టి వీరు తీసుకునే నిర్ణ‌యాల‌ను ఒక‌టికిరెండుసార్లు ప‌రిశీలించుకుని ముందుకెళ్లాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని