Updated : 29 Jun 2022 19:23 IST

WhiteHat Jr: 300 మంది ఉద్యోగుల్ని తొలగించిన వైట్‌హ్యాట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ నేతృత్వంలోని ఆన్‌లైన్‌ కోడింగ్‌ ప్రొవైడర్‌ వైట్‌హ్యాట్‌ జూనియర్‌ 300 మంది ఉద్యోగులను తొలగించింది. వర్క్‌ ఫ్రమ్‌ హోం నుంచి తిరిగి ఆఫీసులకు రావాలని కంపెనీ కోరడంతో ఇటీవలే 1000 మంది రాజీనామా చేశారు. తాజాగా మరో 300 మందిని కంపెనీయే బయటకు పంపింది.

తొలగించిన ఉద్యోగుల్లో కోడింగ్‌ బోధించేవాళ్లు, సేల్స్‌ విభాగానికి చెందినవారు ఉన్నారు. వారికి అదనంగా ఒకనెల వేతనం ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది. దీర్ఘకాలంలో మంచి వృద్ధి సాధించడం కోసం, నాణ్యమైన సేవల్ని అందించడం కోసం సంస్థ మానవ వనరుల్ని సమీక్షిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కరోనా సంక్షోభం ముగిసి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్న తర్వాత ఎడ్‌టెక్‌ పరిశ్రమ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. 

వైట్‌హ్యాట్‌ జూనియర్‌ను బైజూస్‌ జులై 2020లో 300 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. 2021 ఆర్థిక సంవత్సంరలో ఈ కంపెనీ రూ.1690 కోట్ల భారీ నష్టాల్ని నమోదు చేసింది. మరోవైపు ఒక్క ఏడాదిలోనే వ్యయాలు రూ.69.7 కోట్ల నుంచి రూ.2,175 కోట్లకు చేరాయి. మొత్తం 5000 మంది ఉద్యోగులు సంస్థలో పనిచేస్తుండేవారు. ఆఫీసులకు రావాలని కంపెనీ ఆదేశించడంతో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న దాదాపు 1000 మంది రాజీనామా చేశారు. 

వచ్చే విద్యాసంవత్సరానికి కోడింగ్‌ను 10 లక్షల మంది స్కూల్‌ విద్యార్థులకు చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటైన స్కూల్స్‌ విభాగాన్ని కూడా వైట్‌హ్యాట్‌ మూసివేసింది. మరోవైపు పియానో, గిటార్‌ వంటి ఆన్‌లైన్‌ సంగీత శిక్షణ కూడా కంపెనీకి ఏమాత్రం ప్రయోజనకరంగా లేదని సమాచారం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని