త‌గ్గినా.. ఆపొద్దు.

మార్కెట్లు కింద‌కు వ‌చ్చినా ప్ర‌తీ నెలా చేసే సిప్ ల‌ను కొన‌సాగించ‌డం ద్వారా ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చని ఆర్థిక స‌ల‌హాదారులు సూచిస్తున్నారు.​​​​​​...

Published : 19 Dec 2020 13:11 IST

మార్కెట్లు కింద‌కు వ‌చ్చినా ప్ర‌తీ నెలా చేసే సిప్ ల‌ను కొన‌సాగించ‌డం ద్వారా ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చని ఆర్థిక స‌ల‌హాదారులు సూచిస్తున్నారు.​​​​​​​

సెప్టెంబ‌రు నెల 21 న మార్కెట్లో ఒకే రోజులో సెన్సెక్స్ సుమారు 1000 పాయింట్ల వ‌ర‌కూ దిద్దుబాటు జ‌రిగింది. అక్టోబ‌రులో అస్థిత‌ర‌త మ‌రింత పెరిగి 2018 లో గ‌త తొమ్మిది నెల‌ల కంటే అధిక స్థాయిలో అస్థిరత‌ ఏర్ప‌డింది. ముఖ్యంగా ఈక్విటీ సంబంధిత పెట్టుబ‌డులు చేసే వారికి ఇలాంటి ప‌రిణామాలు ఆందోళ‌న క‌లిగించేవే. దీంతో పాటు చ‌మురు ధ‌ర‌లు పెరుగుతుండ‌టం, రూపాయి బ‌ల‌హీన‌ప‌డ‌టం ప్ర‌భావం చూపుతున్నాయి. అస్థిరత‌ అధికంగా ఉంటే స‌మీప భ‌విష్య‌త్తులో మార్కెట్ ఏవిధంగా ఉంటుంద‌నే విష‌యం అంచ‌నా వేయ‌లేం.

  • మంచి రాబ‌డి రాకుండా ప్ర‌తీ నెలా పెట్టుబ‌డి కొన‌సాగించ‌డం మ‌దుప‌ర్ల‌లో కాస్త ఆందోళ‌న క‌లిగించొచ్చు. అయితే ఈ ప‌రిణామం స్వ‌ల్పకాలానికి మాత్ర‌మే ఉంటుంది. దీర్ఘ‌కాలంలో వీటి ప్ర‌భావం త‌గ్గి ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించిన రాబ‌డి పొంద‌వ‌చ్చు.

సిప్ పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డుల‌ను ఇస్తున్నాయా? లేదా? అని తెలుసుకునేందుకు గ‌త కొంత కాలంగా మ్యూచువ‌ల్ ఫండ్ల రాబ‌డి ఏవిధంగా వ‌స్తుంద‌నేదాన్ని ప‌రిశీలించ‌డం ద్వారా ఒక అంచ‌నా కు రావొచ్చు.

ప‌ది ఈక్విటీ పెట్టుబ‌డి ప‌థ‌కాల‌ను తీసుకుని, గ‌త ప‌దేళ్లు, ఐదేళ్లలో ఏవిధంగా రాబ‌డి ఇచ్చాయ‌నే దాన్ని తెలుసుకుంటే. 2008 నుంచి 2018 వ‌ర‌కూ తీసుకుంటే, గ‌త ప‌దేళ్ల కాలంలో 2000, 2008, 2013 సంత్స‌రాల్లో అవాంత‌రాలు ఏర్ప‌డ్డాయి. మూడు సంద‌ర్భాల్లో 2008, 2010, 2011ల్లో రాబ‌డి శాతం స‌గ‌టు కంటే ఎక్కువ సార్లు వ‌చ్చింది. మిగిలిన సంద‌ర్భాల్లో లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్ల‌లో 14 -18 శాతం రాబ‌డి, స్మాల్ క్యాప్ ఫండ్ల‌లో23 శాతం రాబ‌డి వ‌చ్చింది. గ‌త ప‌దేళ్ల‌లో స‌గ‌టు రాబ‌డి 14-18శాతం వ‌ర‌కు వ‌చ్చింది.

  • ఐదేళ్ల‌ రాబ‌డి వివ‌రాల‌ను తీసుకుంటే ఒక ప‌థ‌కంలో జ‌న‌వ‌రి 2008కి గ‌రిష్టంగా రాబ‌డి 54 శాతం వ‌చ్చింది. ఫిబ్ర‌వ‌రి 29న క‌నిష్టంగా 2 శాతం రాబ‌డి వ‌చ్చింది. క‌నిష్ట ఐదేళ్ల రాబ‌డి తిరిగి 2012 లోన‌మోదైంది.

అస్థిత‌ర‌త (వొల‌టైలిటీ) ను స్టాండ‌ర్డ్ డీవియేష‌న్ ను లెక్కించ‌డం ద్వారా తెలుసుకుంటారు.

  • మార్కెట్లో ఏర్ప‌డే హెచ్చుత‌గ్గుల వ‌ల్ల దీర్ఘ‌కాలంపాటు పెట్టుబ‌డి కొన‌సాగించేవారికి మంచిద‌ని ఆర్థిక స‌ల‌హాదారులు చెబుతుంటారు. మార్కెట్లు ఎప్పుడూ పైకి వెళ్తే రాబ‌డి ఎక్కువ శాతం రాదు. మ‌ధ్య‌లో మార్కెట్లు కింద‌కు వ‌చ్చిన‌పుడు మ‌దుప‌ర్లు త‌మ సిప్ ల‌ను కొన‌సాగించ‌డం ద్వారా ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు.

మ‌దుప‌ర్లు ఎంత రాబ‌డి వ‌చ్చింద‌నే దాని కంటే త‌మ ఆర్థిక ల‌క్ష్యాల‌ను సాధించేందుకు అవ‌స‌ర‌మైన మొత్తాన్ని స‌మ‌కూర్చుకోగ‌ల‌మా లేదా అనేది చూసుకోవాలి. ప‌ద‌వీవిర‌మ‌ణ లేదా ఇంటికొనుగోలు లాంటి ఆర్థిక ల‌క్ష్యాల‌ను ఏర్ప‌రుచుకుని వాటిని నెర‌వేర్చుకునేందుకు ప్ర‌ణాళికాబ‌ద్ధంగా పెట్టుబ‌డి చేయాలి. మార్కెట్లు అనుకూలంగా లేన‌పుడు పెట్టుబ‌డి చేయ‌కూడ‌దేమో అనే ఆలోచ‌న అవ‌స‌రం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని