ప్ర‌మాద బీమా అవసరం ఎంత‌?

ప్ర‌మాద స్థాయి ఆధారంగా వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా హామీని చెల్లిస్తారు.

Published : 25 Dec 2020 20:35 IST

అర్జున్ అనే వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల నిపుణుడు గ‌త సంవ‌త్స‌రం వ్యాపార నిమిత్తం ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యారు. అత‌ను త‌న రెండు కాళ్ళకు తీవ్ర‌మైన గాయాలతో ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. అయితే ఎముక‌లలో వ‌చ్చిన ప‌గ‌ళ్ళు, ఇత‌ర గాయాల నుంచి కోలుకోవాడానికి మూడు నెల‌లు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించారు. అదృష్ట‌వ‌శాత్తూ, అత‌ను త‌న భార్య ప‌ట్టుద‌ల‌పై కొంత కాలం కింద‌ట‌ వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా పాల‌సీని కొనుగోలు చేశాడు. నామ‌మాత్ర‌పు ధ‌ర‌ను చెల్లించి కొనుగోలు చేసిన బీమా ప‌థ‌కం అర్జున్ ప్ర‌మాదానికి గురైన‌ప్పుడు అయిన గాయాల‌కు చికిత్స చేయించుకునేందుకు ఆర్ధికంగా స‌హాయ‌ప‌డింది.

  1. నామమాత్రపు ప్రీమియం

వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా వంటి పాల‌సీల అవ‌స‌రాల‌ను చాలా మంది విస్మ‌రిస్తున్నారు. ఈ బీమాలో దాదాపు రూ. 500 నామ‌మాత్ర‌పు ప్రీమియంతో రూ.10 ల‌క్ష‌ల హామీ పొంద‌వ‌చ్చు. వాస్త‌వానికి పైన వివ‌రించిన విధంగా అనుకోని ప్ర‌మాదానికి గురై మ‌ర‌ణం సంభ‌వించినా, వైక‌ల్యం ఏర్ప‌డినా ఇది బీమా హామీ అందించి ఆదుకుంటుంది. తాత్కాలిక, శాశ్వత వైకల్యం లేదా తీవ్ర‌ప్ర‌మాదం జ‌రిగి అత‌ను ప‌నిచేయ‌లేని కాలానికి ఆదాయ న‌ష్టప‌రిహారాన్ని అందించేందుకు వ్యక్తిగత ప్రమాద బీమా పాల‌సీ సహాయపడుతుంది. అర్జున్ ప్ర‌మాదానికి గురై మూడు నెలలపాటు విశ్రాంతి తీసుకున్న‌ప్పుడు ఆ స‌మ‌యంలో త‌న కుటుంబ ఖ‌ర్చులకు కావ‌ల‌సిన‌ మొత్తాన్ని రోజు వారీ భ‌త్యం ద్వారా బీమా సంస్థ చెల్లిచింది. రెండోది వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా క్లెయిమ్ చేయ‌డానికి ప్ర‌మాద స్థాయితో ప‌ట్టింపు లేదు.

రోడ్డు ప్ర‌మాదాల వంటి పెద్ద ప్ర‌మాదాల‌కే కాకుండా సైకిల్‌పై నుంచి ప‌డిపోవ‌డం వ‌ల్ల చేయి విర‌గ‌డం, ఫుట్‌బాల్ ఆడుతుండ‌గా కాలు విర‌గడం వంటి చిన్న ప్ర‌మాదాల కూడా వైద్య నిమిత్తం అయ్యే ఖ‌ర్చులు అందిస్తారు.

  1. చెల్లింపులు

ప్ర‌మాదానికి గురైన తీవ్ర‌త‌ను బ‌ట్టి బీమా సంస్థ‌ చెల్లింపులు ఉంటాయి. ప్ర‌మాదంలో వ్య‌క్తి మ‌ర‌ణిస్తే 100 శాతం హామీ మొత్తాన్నిచెల్లిస్తారు. శాశ్వ‌త‌, పాక్షిక వైక‌ల్యం ఏర్ప‌డితే హ‌మీ మొత్తంలో 75 శాతం చెల్లిస్తారు. సాహ‌స‌వంత‌మ‌యిన క్రీడ‌లు,చిన్న‌చిన్న గాయ‌ల వ‌ల‌న ఎముక‌లు విర‌గ‌టం, , అనుకోని విధంగా మ‌ర‌ణం, తాత్కాలిక‌, శాశ్వ‌త వైక‌ల్యం వంటి వాటికి ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా పాల‌సీలు అందుబాటులో ఉన్నాయి. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారి చికిత్స అందించేందుకు ఎయిర్ అంబులెన్స్‌, ప్ర‌మాదానికి గురైన వ్య‌క్తి చెల్లించాల్సిన రుణాలు ఉంటే వాటికి హామీ గా ఉండ‌టం చెల్లించాల్సిన ఈఎమ్ఐలు ఉంటే వాటిని చెల్లించ‌డం త‌దిత‌ర‌ సేవ‌ల‌ను బీమా పాల‌సీల ద్వారా పొంద‌వ‌చ్చు.

  1. ప్రయాణంలో స‌హాయంగా

ఆరోగ్య బీమా పాలసీల మాదిరిగానే, ప్రయాణ ప్రమాద బీమా కూడా చాలా ముఖ్య‌మైన‌ది. ముఖ్యంగా యుక్త‌ వయస్సులో ఉన్న వారికి చాలా అవ‌స‌రం. సాధార‌ణంగా ప‌ని, విశ్రాంతి కోసం త‌ర‌చుగా ప్ర‌యాణాల చేస్తున్న‌వారు త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌యాణ బీమాను కొనుగోలు చేయాలి. వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమాను ప్ర‌తీ సంవ‌త్స‌రం దీనిని పున‌రుద్ధ‌రించుకోవాలి. ప్ర‌మాదం జ‌రిగిన మొద‌టి రోజు నుంచే బీమా హామీ అందుతుంది. అనుకోని ప‌రిస్థితుల్లో ఎదుర‌య్యే ప్ర‌మాదాల నుంచి కాపాడి ఆర్ధికంగా సహాయపడి, కుటుంబ స‌భ్యుల‌కు ర‌క్ష‌ణ‌గా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని