ప్ర‌యాణ బీమా ఎందుకు తీసుకోవాలంటే..

మెడిక‌ల్ ఎవాక్యూయేష‌న్ పాల‌సీ వ్య‌క్తిని అత్య‌వ‌స‌ర త‌ర‌లింపు ద్వారా ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేయించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్రయాణ బీమా క‌వ‌రేజీ కేవ‌లం ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు మాత్ర‌మే కాదు..

Published : 18 Dec 2020 16:39 IST

మెడిక‌ల్ ఎవాక్యూయేష‌న్ పాల‌సీ వ్య‌క్తిని అత్య‌వ‌స‌ర త‌ర‌లింపు ద్వారా ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేయించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్రయాణ బీమా క‌వ‌రేజీ కేవ‌లం ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు మాత్ర‌మే కాదు.. సామానులు అప‌హ‌ర‌ణ లేదా పొగొట్టుకోవ‌డం, ప్ర‌యాణ ఆల‌స్యం వంటి వాటికి కూడా వ‌ర్తిస్తుంది. సోలో ట్రావెల‌ర్ అయినా లేదా కుటుంబంతో క‌లిసి సెలవుదినం కోసం విహారానికి వెళ్లినా వ్యాపార నిమ‌త్తం నిత్యం ప్రయాణాలు చేసేవారైనా ప్ర‌యాణ బీమా తీసుకోవ‌డం మంచిది. ఒక మంచి ప్ర‌యాణ బీమా పాల‌సీ వివిధ ర‌కాలుగా ప్ర‌యాణాల‌కు సంబంధించి ర‌క్ష‌ణను క‌లిగిస్తుంది.

ప్రయాణ బీమా రకాలు

ఆరోగ్య బీమా
సామానుల‌ బీమా
ట్రిప్ బీమా

మెడికల్ కవరేజ్: స్వదేశం నుంచి దూరంగా ఉన్న‌పుడు ఈ బీమా చాలా అవ‌స‌రం. అక‌స్మాత్తుగా వ‌చ్చే వైద్య అవ‌స‌రం ద్వారా అధిక వైద్య ఖర్చులను అధిగమించే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న చికిత్స‌ల‌నుంచి పెద్ద అత్య‌వ‌స‌ర చికిత్స‌ల‌కు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతర్జాతీయంగా ప్ర‌యాణాలు చేసే స‌మయంలో వైద్య సంరక్షణకు ప్ర‌యాణ బీమా తీసుకోవ‌డం ఉపయోగకరంగా ఉంటుంది

మెడిక‌ల్ ఎవాక్యూయేష‌న్ పాల‌సీ వ్య‌క్తిని అత్య‌వ‌స‌ర త‌ర‌లింపు ద్వారా ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేయించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఉదాహరణకు, ఒక‌ వ్య‌క్తి ఆఫ్రికా అరణ్యంలో ట్రెక్కింగ్ ట్రిప్ కి వెళ్లార‌నుకుందాం. ఆ స‌మ‌యంలో ఏదొక‌ కీటకం కుట్టడం ద్వారా కాలు వాచిపోయి న‌డ‌వ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌నుకుందాం. దానికి తక్షణ వైద్య శ్రద్ధ అవసరం. వెంట‌నే ఒక హెలికాప్టర్లో గాయ‌ప‌డిన వ్య‌క్తిని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డం ద్వారా స‌మ‌యానికి చికిత్స చేయ‌డం ఇలాంటి సందర్భంలో, వైద్య ఖ‌ర్చులు, తరలింపు అయ్యే ఖర్చులను మెడిక‌ల్ ఎవాక్యూయేష‌న్ బీమా పాల‌సీ ద్వారా పొంద‌వ‌చ్చు. లేదంటే ఆ ఖ‌ర్చు మొత్తం ఆ వ్య‌క్తి సొంతంగా భ‌రించాల్సి ఉంటుంది.

సామాను రక్షణ: లగేజీలో కొన్ని ఖరీదైన వస్తువులను తీసుకుని విదేశాలకు వెళ్లేవారు లేదా వ‌చ్చేవారు ఉంటారు. విలువైన‌ వ‌స్తువుల‌ను ఎవ‌రైనా దొంగిలిస్తార‌న్న భ‌యం స‌హ‌జం ఉంటుంది. ప్రయాణ సమయంలో సామాను రక్షణ కవరేజి ఉంటే నిశ్చింత‌గా ఉండొచ్చు. పాస్పోర్ట్, వీసా మొదలైన పత్రాలకు కూడా బీమా వ‌ర్తిస్తుంది. కొన్ని బీమా కంపెనీలు, సామాను ర‌క్ష‌ణ బీమాతో పాటు, ప్రయాణ బీమా కూడా అందిస్తున్నారు. అత్యవసరంగా ట్రావెల్ ఏజ‌న్సీ అవసరం లేదా అత్యవసర నగదు బదిలీ, ప్రయాణానికి వెళ్ల‌బోయే దేశ స‌మ‌చారం , చట్టపరమైన సలహాలు వంటి సేవ‌ల‌ను బీమా సంస్థ‌లు అందిస్తున్నాయి. టాటా ఏఐజీ వంటి బీమా సంస్థలు ఇటువంటి సందర్భాల్లో సహాయం అందిస్తారు.

ట్రిప్ బీమా : ప్రయాణ బీమాలో అత్యంత సాధారణమైని ట్రిప్ బీమా అనుకోని పరిస్థితుల కారణంగా, చివరి నిమిషంలో ప‌ర్య‌ట‌నరద్దు చేయవలసి వచ్చినప్పుడు ఈ బీమా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. విమాన ఆలస్యం లేదా రద్దు ఛార్జీలు, హోటల్ రద్దు రుసుము మొదలైన వాటి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. ఈ బీమా లేని వారు రద్దు చేసేందుకు అయ్యే ఛార్జీలు భ‌రించాల్సి ఉంటుంది.

బీమా పాల‌సీ తీసుకును ముందు కవరేజ్ కి స‌బంధించిన ముఖ్య విష‌యాలు, బీమా పరిధిని అలాగే ఏవైనా సంద‌ర్భాల్లో పాల‌సీదారుడు భరించాల్సిన ఖర్చులు ఉంటే వాటి గురించి తెలుసుకోవ‌డం మంచిది. వివిధ రకాల ప్రయాణ బీమా పాలసీల గురించి అవగాహన కలిగిన వారిని లేదా తెలిసిన‌ బీమా ఏజెంట్ ని సంప్ర‌దించ‌డం మంచిది. ప్రయాణ బీమా పాల‌సీల‌కు సంబంధించిన స‌మాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. పాల‌సీ తీసుకునే ముందువివిధ ర‌కాల పాల‌సీల‌ను పోల్చిచూసుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని