Aadhaar card: ఆధార్ తీసుకుని 10 ఏళ్లు అయ్యిందా? అయితే అప్‌డేట్ చేయండిలా..!
ఆధార్ బేస్డ్ అథంటికేషన్‌లో ఎటువంటి అడ్డంకులు రాకుండా సులభంగా పూర్తిచేసుకునేందకు అప్‌డేట్ చేసుకోవడం మంచిది.
ఇంటర్నెట్ డెస్క్: 10 ఏళ్ల క్రితం ఆధార్ తీసుకున్న వ్యక్తులు, తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కోరింది. అయితే, ఇది తప్పనిసరి కాదని తెలిపింది. వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ప్రస్తుతం ఆధార్‌ను ఉపయోగిస్తున్నారు. ఆధార్ బేస్డ్ అథంటికేషన్‌లో ఎటువంటి ఇబ్బందులూ రాకుండా, సులభంగా పనులు పూర్తి చేసుకునేందకు అప్‌డేట్ చేసుకోవడం మంచిదని UIDAI ఓ ప్రకటనలో తెలిపింది.
ఎలా అప్‌డేట్ చేసుకోవాలి?
వ్యక్తులు తమ గుర్తింపు రుజువు, చిరునామాను ఆన్‌లైన్ ద్వారా 'మై ఆధార్' పోర్టల్‌లో గానీ, దగ్గరలోని ఆధార్ సెంటర్‌కి వెళ్లి గానీ అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం అవసరమైన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.
ఏయే వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు?
పేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, రిలేషన్‌షిప్ స్టేటస్, ఐరిస్, వేలిముద్ర, ఫోటో వంటి వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ వివరాలను ఎప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి?
పైన తెలిపిన వివరాల్లో ఏమైనా మార్పులు చేయాల్సివచ్చినప్పుడు ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. వయసు, అనారోగ్యం, ప్రమాదం వంటి కారణాలతో మార్పులు రావచ్చు. అందువల్ల భారతీయ నివాసితులందరూ తమ బయోమెట్రిక్ డేటాను 10 సంవత్సరాలకు ఒకసారి అప్‌డేట్ చేయడం మంచిదని UIDAI సూచిస్తోంది.
ఒకవేళ మీకు 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు ఉంటే.. వారికి ఆధార్ తీసుకోవచ్చు. అయితే, 5 సంవత్సరాల లోపు ఆధార్‌కు నమోదు చేసుకున్నవారు, మరో రెండు సార్లు ఆధార్ అప్‌డేట్ చేయాలి. పిల్లలకు 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకసారి, 15 సంవత్సరాలు నిండిన తర్వాత మరోసారి ఆధార్‌ను అప్‌డేట్ చేయాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
బళ్లారి నగర పాలికె మేయర్‌గా 23 ఏళ్ల యువతి
-
World News
గోధుమ పిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట: పాకిస్థాన్‌లో 11 మంది మృత్యువాత
-
World News
5 నెలలకే పుట్టేశారు.. ముగ్గురు కవలల గిన్నిస్ రికార్డు
-
India News
20 రూపాయలకే మినీ హోటల్లో గది
-
Politics News
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు... న్యాయపరంగానే పోరాడతా
-
Ts-top-news News
టోల్ రూపంలో 9 ఏళ్లలో రూ.9 వేల కోట్ల వసూలు