Credit Card: క్రెడిట్ కార్డు కనీస మొత్తం పెరగనుందా?
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బకాయి ఉన్న మొత్తానికి వర్తించే ఫైనాన్స్ ఛార్జీలు, ఇతర పెనాల్టీలు, పన్నులు తదుపరి స్టేట్మెంట్లో చేర్చకూడదు
ఇంటర్నెట్ డెస్క్: క్రెడిట్ కార్డు (Credit card) బిల్లును పూర్తిగా చెల్లించలేని పక్షంలో కనీస మొత్తాన్ని (Minimum amount) చెల్లించి మిగిలిన మొత్తాన్ని తర్వాతి నెలకు బదిలీ చేస్తుంటారు కొందరు. దీనివల్ల ఆ నెల వరకు క్రెడిట్ కార్డు బిల్లు పూర్తిగా చెల్లించాల్సిన అవసరం లేకపోయినా.. చెల్లించని మొత్తంతో పాటు, ఇతర ఛార్జీలు, పన్నులు, వాటిపై వర్తించే వడ్డీలతో రుణ భారం క్రమంగా పెరిగిపోతుంటుంది. చివరికి చెల్లించలేని స్థాయికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో కనీసం చెల్లింపు లెక్కించే విధానాన్ని మార్చాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్రెడిట్ కార్డు జారీ సంస్థలను కోరింది.
ఆర్బీఐ ప్రకారం కనీస మొత్తం ఎంతుండాలి?
ఆర్బీఐ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. క్రెడిట్ కార్డుపై చెల్లించాల్సిన కనీస మొత్తంపై వర్తించే వడ్డీ, చెల్లించాల్సిన ఇతర ఛార్జీలు, పన్నులు కంటే ఎక్కువగా గానీ, సమానంగా గానీ ఉండాలి.
ఉదాహరణకు మీ క్రెడిట్‌కార్డు బకాయి మొత్తం రూ.10 వేలు. నెలకు 3% చొప్పున వడ్డీ పడుతుందనుకుందాం. ఒకవేళ సరైన సమయానికి బిల్లు చెల్లించేస్తే వడ్డీ ప్రస్తావన ఉండదు. అలాకాకుండా తరువాతి నెలకు వాయిదా వేస్తే వడ్డీ రూ.300 (రూ.10 వేలలో 3%), పన్నులు/ ఇతర ఛార్జీలు మరో రూ.50 అనుకుంటే అదనంగా రూ. 350 చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు మినిమం అమౌంట్ అనేది రూ.350 కంటే తక్కువగా ఉండకూడదు.
ఒకవేళ మీ బ్యాంకు కనీస మొత్తంగా బ్యాలెన్స్ మొత్తంలో 5%.. అంటే రూ.500 వసూలు చేస్తుందనుకుందాం. ఈ రెండింటిలో రూ.500 ఎక్కువగా ఉంది కాబట్టి రూ. 500 కనీస బ్యాలెన్స్ చెల్లించాలని బ్యాంకులు స్టేట్మెంట్లో చూపిస్తాయి. అలాకాకుండా మీ బ్యాంకు కనీస మొత్తంగా బ్యాలెన్స్ మొత్తంలో 3%, అంటే రూ. 300 వసూలు చేస్తుందనుకుందాం. ఈ రెండింటిలో రూ.350 ఎక్కువగా ఉంది కాబట్టి రూ.350 కనీస బ్యాలెన్స్ చెల్లించాలని బ్యాంకులు స్టేట్మెంట్లో చూపించాలి.
సాధారణంగా క్రెడిట్ కార్డుపై కనీస బ్యాలెన్స్ ఎంత అనేది కార్డు జారీ సంస్థలపై ఆధారపడి ఉంటుంది. చాలా వరకు సంస్థలు మొత్తం బిల్లులో 5% కనీస బ్యాలెన్స్‌గా వసూలు చేస్తాయి. ఆర్బీఐ కొత్త నియమాల ప్రకారం కార్డు జారీసంస్థలు కనీస బ్యాలెన్స్‌ను 5 శాతానికి మించి కూడా విధించవచ్చు.
ఆర్బీఐ నిబంధన క్రెడిట్‌కార్డుదారులకు లాభిస్తుందా?
కార్డుదారుడు.. క్రెడిట్ కార్డ్ బిల్లుపై చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తే.. బకాయిలను పూర్తిగా చెల్లించే వరకు అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్‌పై మాత్రమే కాకుండా అన్ని కొత్త లావాదేవీలపై వడ్డీ వసూలు చేస్తారు. ఒకవేళ కార్డుదారుడు కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లించడం కొనసాగిస్తే ప్రతి నెలా వడ్డీపై వడ్డీ లెక్కిస్తారు. పెద్ద మొత్తాల్లో బకాయి ఉన్నప్పుడు, దీనిపై వర్తించే వడ్డీ.. చెల్లించాల్సిన కనీస మొత్తం కంటే ఎక్కువగా ఉండొచ్చు. దీంతో క్రెడిట్‌కార్డుదారులు రుణ ఉచ్చులో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. ఆర్బీఐ నిబంధన ప్రకారం.. మినిమమ్ అమౌంట్ ఎక్కువ ఉండడం వల్ల కొంతకాలానికైనా అప్పు తీరే అవకాశం ఉంటుంది.
గుర్తుంచుకోండి..
బలమైన కారణం ఉంటే తప్ప కనీస బిల్లు చెల్లింపు ఉండకూడదు. ఎల్లప్పుడూ పూర్తి బిల్లును సమయానికి చెల్లించడం మంచిది. లేదంటే వర్తించే ఛార్జీలతో బిల్లు భారం అవుతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Aaftab: శ్రద్ధాను చంపి.. చికెన్ రోల్ తిన్నాడు
-
India News
రూ.50వేల చొప్పున తీసుకున్నారు.. భర్తల్ని వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోయారు
-
Crime News
Crime News: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య బలవన్మరణం
-
Politics News
Kotamreddy: అభిమానం ఉండాలి.. రూ.కోట్లుంటే గెలవలేరు: కోటంరెడ్డి
-
Politics News
జగన్ గ్రాఫ్ పడిపోతోంది.. ఏపీ వెళ్లి పాదయాత్ర చేసుకో: షర్మిలకు కడియం సూచన
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు