Published : 23 Nov 2021 14:19 IST

Indian IPOs: ఐపీఓలకు బ్రేక్‌ పడనుందా?

దిల్లీ: భారత స్టాక్‌ మార్కెట్లలో ఇప్పటి వరకు ఐపీఓల హవా కొనసాగింది. ముఖ్యంగా టెక్నాలజీ ఆధారిత కంపెనీలు భారీ ఎత్తున పబ్లిక్‌ ఇష్యూకి వచ్చాయి. కానీ, ఇకపై ఐపీఓల పర్వానికి బ్రేక్‌ పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రధాన కారణం గురువారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్‌ తీవ్ర నష్టాలను మిగల్చడమే. దీంతో మార్కెట్‌ సెంటిమెంటు దెబ్బతిన్నట్లు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

మొబిక్విక్‌, ఓయో వంటి టెక్‌ ఆధారిత కంపెనీలు త్వరలో ఐపీఓకి వచ్చేందుకు ఇప్పటి వరకు సన్నాహాలు చేసుకున్నాయి. అయితే, పేటీఎం ఫలితాలు చూసిన తర్వాత వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మార్కెట్‌ ప్రస్తుతం తీవ్ర దిద్దబాటుకు గురవుతోంది. ఈ క్రమంలో మదుపర్లు ఐపీఓలపై ఆసక్తి చూపకపోవచ్చునని ఆయా సంస్థలు భావిస్తున్నట్లు సమాచారం. పేటీఎంలో రిటైల్‌ మదుపర్లు భారీ ఎత్తున షేర్లను కొనుగోలు చేశారు. కానీ, వారి సంపద ఇప్పటికే 30-35 శాతం వరకు ఆవిరైంది. ఆ కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1.39 లక్షల కోట్ల నుంచి రూ.85 వేల కోట్లకు తగ్గింది. సోమవారం కంపెనీ షేర్లు ఓ దశలో ఏకంగా 40 శాతం కుంగాయి. నేడు 7 శాతం వరకు కోలుకొని మదుపర్లకు కాస్త ఊరటనిచ్చాయి. ఐపీఓల్లో గుడ్డిగా పెట్టుబడి పెడితే ఉండే పర్యవసానాలను పేటీఎం రుచి చూపించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుండడంతో భవిష్యత్‌పై అంచనాలతో భారత స్టాక్‌ మార్కెట్లలో భారీ ర్యాలీ వచ్చింది. దీన్ని అనేక కంపెనీలు అవకాశంగా మలచుకొని పబ్లిక్‌ ఇష్యూకి వచ్చి సొమ్ము చేసుకున్నాయి. ముఖ్యంగా జొమాటో వంటి కంపెనీలు భారీగా లాభపడ్డాయి. ఇప్పటి వరకు దాదాపు 50 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. రూ.లక్ష కోట్లకు పైగా సమీకరించాయి. మరికొన్ని కంపెనీలు వరుసలో ఉన్నాయి. అయితే, పేటీఎం దెబ్బతో.. ముఖ్యంగా టెక్‌ ఆధారిత కంపెనీలు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని