Published : 07 May 2022 14:57 IST

Elon Musk: ట్విటర్‌ను కొనాలని ట్రంప్‌ చెప్పారా.. ఎలాన్‌ మస్క్‌ ఏమన్నారు..?

ఇంటర్నెట్‌డెస్క్‌: సాంకేతికత రంగంలోనే సంచలనంగా మారిన ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ట్విటర్‌ (Twitter) కొనుగోలుపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) సొంత సోషల్‌మీడియా సంస్థ ‘ట్రూత్‌ సోషల్‌’ కీలక వ్యాఖ్యలు చేసింది. ట్విటర్‌ను కొనాలని మస్క్‌కు ట్రంప్‌ చెప్పారని పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను మస్క్‌ ఖండించారు. ఈ విషయంపై తానెప్పుడూ ట్రంప్‌తో మాట్లాడలేదని స్పష్టం చేశారు. అసలేం జరిగిందంటే..

ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ సీఈఓ డేవిన్‌ న్యూన్స్‌ ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ట్విటర్‌ (Twitter) కొనుగోలు అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ట్విటర్‌ను కొనుగోలు చేయాలంటూ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)ను ట్రంప్‌ సూచించారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన ఓ కథనాన్ని న్యూయార్క్‌ పోస్ట్‌ ప్రచురింది. దీంతో ఎలాన్‌ మస్క్‌ దీనిపై ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ఇది పూర్తిగా అవాస్తవం. ట్రంప్‌తో ప్రత్యక్షంగానీ, పరోక్షంగా గానీ నేను ఎప్పుడూ మాట్లాడలేదు’’ అని తెలిపారు.

2021 జనవరి 6న అమెరికాలోని క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ట్రంప్‌పై ట్విటర్‌ శాశ్వత నిషేధం విధించింది. అయితే దీన్ని సవాల్‌ చేస్తూ ట్రంప్‌ చేస్తోన్న న్యాయపోరాటం కొనసాగుతోంది. మరోవైపు, ట్విటర్‌కు పోటీగా ట్రంప్‌ సొంతంగా ‘ట్రూత్‌ సోషల్‌ (Truth Social)’ పేరుతో సోషల్‌మీడియా యాప్‌ను ప్రారంభించారు.

ఇటీవల ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు ఎలాన్‌ మస్క్‌ ఒప్పందం చేసుకున్న తర్వాత ట్రంప్‌ను తిరిగి ఈ సోషల్‌మీడియాలోకి తీసుకొస్తారంటూ వార్తలు వచ్చాయి. వీటిపై ట్రంప్‌ స్పందిస్తూ.. ‘‘వ్యక్తిగతంగా నాకు మస్క్‌ అంటే చాలా ఇష్టం. అయితే నా పట్ల ట్విటర్‌ ప్రవర్తించిన తీరు పట్ల నేను అసంతృప్తి చెందాను. ఒకవేళ నన్ను ట్విటర్‌లోకి అనుమతించినా నేను మాత్రం రాను’’ అని స్పష్టం చేశారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని