Budget 2023: డ్రాగన్ శక్తిని ఎదుర్కోవాలంటే..!
భారత్ ముంగిట చైనా ఆయుధాలను మోహరించి కూర్చొంది. ఈ పరిస్థితుల్లో మన దళాలను అత్యాధునిక ఆయుధాలతో బలోపేతం చేయకపోతే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇంటర్నెట్‌డెస్క్: భారత్ గతంలో ఎన్నడూ ఎదుర్కోనంత ముప్పును వాస్తవాధీన రేఖ వద్ద ఎదుర్కొంటోంది. ఎల్‌ఏసీ వద్ద పాగావేసిన చైనా దళాలు వెనక్కి తగ్గే ఆలోచనే చేయడం లేదు. అంతకంతకూ చొచ్చుకొస్తున్నాయి. చైనా వైపు 5జీ కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌తో సహా అత్యాధునిక సాంకేతికతను కూడా మోహరిస్తోంది. చైనా ముప్పు కేవలం హిమగిరులకే పరిమితం అనుకొంటే పొరబడ్డట్లే. డ్రాగన్ నౌకలు బంగాళాఖాతంలోకి కూడా చొచ్చుకొస్తున్నాయి. భారత్ చుట్టూ నౌకాదళ స్థావరాలను ఏర్పాటు చేసుకొంటున్నాయి. 2025 నాటికి చైనా వద్ద 400 యుద్ధ నౌకలు ఉంటాయని అమెరికా అంచనా వేసింది. భారత్ వద్ద ప్రస్తుతం కేవలం 139 మాత్రమే ఉన్నాయి. వైమానిక దళం రష్యా తయారీ మిగ్ 21లతో ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ ప్రకారం రక్షణ రంగంపై చైనా 230 బిలియన్ డాలర్లు వెచ్చించగా.. భారత్ కేవలం 54 బిలియన్ డాలర్లే కేటాయిస్తోంది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వత ఆయుధ పోటీకి దూరంగా జపాన్ కూడా చైనా దెబ్బకు రక్షణ బడ్జెట్‌ను గణనీయంగా పెంచుకొంది. చైనా ఎంత వేగంగా ప్రబల శక్తిగా మారుతోందో అన్న విషయానికి ఇదే ఉదాహరణ. ఈ నేపథ్యంలో 2023 బడ్జెట్‌లో సబ్‌మెరైన్లు, తేలికపాటి యుద్ధ ట్యాంకులు, ఫైటర్ విమానాల కొనుగోళ్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలున్నాయి.
- ఐఎన్‌ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకను ఇప్పటికే హడావుడిగా నౌకాదళంలో ప్రవేశపెట్టారు. కానీ, దీనిపై వినియోగించేందుకు అవసరమైన విమానాల కొనుగోళ్లు మాత్రం ఇప్పటికీ పూర్తికాలేదు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే ఈ నౌకను వాడుకొనే పరిస్థితి లేదు. ఇప్పటికే దీనిపై 27 రఫేల్ మెరైన్ రకం విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ కొనుగోళ్ల కాంట్రాక్టుల ప్రక్రియ పూర్తికావాలంటే కనీసం ఏడాదైనా పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ విమానాల కొనుగోళ్లకు పచ్చజెండా ఊపేందుకు అవసరమైన నిధులను కేటాయించాలి.
- ప్రాజెక్టు 75ఐ కింద కొత్తగా ఆరు జలాంతర్గాములను నిర్మించాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి దీని కాంట్రాక్టు చర్చలు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో నిధులను సిద్ధం చేసుకొంటే వేగంగా పనులను మొదలుపెట్టవచ్చు. ఒక వేళ ఈ ప్రాజెక్టు ముందుకు పోకపోతే మరిన్ని స్కార్పియన్ శ్రేణి సబ్‌మెరైన్ల కొనుగోళ్లు చేసేలా నేవీ ఇప్పటికే ప్లాన్-బీ సిద్ధంగా పెట్టుకొన్నట్లు సమాచారం.
- ఇండో-పసిఫిక్ వ్యూహానికి మరింత పదును రావాలంటే భారత్ నౌకాదళం డ్రోన్ల వినియోగం పెంచాలి. ఇప్పటికే ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోళ్లపై కూడా చర్చలు జరుగుతున్నాయి. సముద్ర నిఘా, శత్రు జలాంతర్గాముల కట్టడికి ఇవి చాలా అవసరం.
- తరచూ చోటుచేసుకొంటున్న యుద్ధ విమానాల ప్రమాదాల కారణంగా వాయుసేన బలం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఐఏఎఫ్ త్వరగా యుద్ధ విమానాలను సమకూర్చుకోవాలి. దీనికి సంబంధించి మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కాంట్రాక్టును ముందుకు తీసుకెళ్లడమో.. మరిన్ని రఫెల్స్ కొనుగోలు చేయడంమో చేయాలి. సరిహద్దుల్లో ఉద్రిక్తతల సమయంలో వాయుసేనను బలహీనంగా ఉంచడం ఏమాత్రం వాంఛనీయం కాదు.
- రక్షణ రంగ కేటాయింపులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి కేంద్రం నాన్‌లాప్సబుల్ ఫండ్‌ను ఈ సారైనా ఏర్పాటు చేస్తుందని దళాలు ఆశిస్తున్నాయి. ఎందుకంటే ఆయుధ కాంట్రాక్టులు పూర్తి కావాలంటే చాలా దశలను దాటాలి. ఇందుకు సమయం పడుతుంది. ఈ లోపు కేటాయింపులు మురిగిపోకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.
- ఇటీవల రక్షణ మంత్రత్వ శాఖలో జరిగిన కార్యక్రమంలో త్రివిధ దళాలు ఈ సారి కేటాయింపులు పెంచాలని బలంగా కోరాయి. గతేడాది బడ్జెట్‌లోనే మూలధన వ్యయాలను రూ.1.32 లక్షల కోట్ల నుంచి రూ.1.52 లక్షల కోట్లకు పెంచారు. ఈ సారి పెంపు మరింత ఎక్కువగా ఉండొచ్చు.
- వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానంలో మార్పులు చోటు చేసుకోవడంతో పింఛన్ బిల్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన బకాయిల చెల్లింపులకు సంబంధించి అదనంగా 8,450 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది.
- రక్షణ సంస్థల వద్ద అత్యధికంగా భూమి ఉంది. వీటిల్లో చాలా వరకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ హబ్‌లుగా మారాయి. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ కొంత భూమిని విక్రయించి నిధులను సమకూర్చుకొనే అంశంపై కూడా ప్రతిపాదనలు ఉండే అవకాశాలున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
APGEA: ఉద్యోగులపై పోలీసుల వేధింపులు ఆపాలి: ఆస్కార్‌రావు
-
India News
Odisha Train Accident: ఒడిశా విషాదం.. టికెట్ లేని వారికీ పరిహారం!
-
Sports News
WTC Final: మరో రెండ్రోజుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
-
Movies News
Adivi Sesh: ‘కర్మ’పై అడివి శేష్ ఆసక్తికర ట్వీట్.. ఆయనతో పనిచేయడం గర్వంగా ఉందంటూ..
-
General News
Odisha Train Accident: రేపు, ఎల్లుండి పలు రైళ్లు రద్దు
-
India News
Odisha train tragedy: నెత్తుటి పట్టాలపై.. నలిగిపోయిన ‘ప్రేమ గీతాలు’!