Wipro Layoffs: విప్రోలో ఫ్రెషర్లపై వేటు.. 450 మంది ఇంటికి

ఐటీ సంస్థ విప్రో 450 మంది ఫ్రెషర్లను ఇంటికి పంపించింది. శిక్షణ అనంతరం కూడా పనితీరు సరిగా లేని కారణంగా వీరిని తొలగించింది.

Published : 21 Jan 2023 15:09 IST

దిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో (Wipro) ఫ్రెషర్లపై వేటు వేసింది. పనితీరు సరిగా కనబరచని 452 మందిని తొలగించింది. శిక్షణ తర్వాత కూడా పనితీరు మెరుగుపరుచుకోవడంలో విఫలమైనందుకు వారిని ఇంటికి (Layoffs) పంపించింది. ఫ్రెషర్ల తొలగింపును విప్రో సైతం అధికారికంగా ధ్రువీకరించింది. పనితీరు విషయంలో విప్రో ఉన్నత ప్రమాణాలను పాటిస్తుందని, పని ప్రదేశంలో ఎంట్రీ లెవల్‌ ఉద్యోగులకూ ఈ నియమం వర్తిస్తుందంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.

ఫ్రెషర్ల శిక్షణ కోసం ఒక్కొక్కరిపై చేసిన రూ.75వేలు ఖర్చును సైతం తిరిగి చెల్లించాలని విప్రో కోరినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఆ మొత్తాన్ని కంపెనీ తిరిగి తీసుకోవడం లేదని తెలిసింది. వేరే కంపెనీకి సైతం పనిచేస్తున్నారన్న కారణంతో గతంలో 300 మందిని విప్రో తొలగించింది. మరోవైపు ఇటీవలే క్యూ3 ఫలితాలను ప్రకటించిన విప్రో.. కొత్తగా మూడో త్రైమాసికంలో 600 మందిని చేర్చుకున్నట్లు తెలిపింది. భవిష్యత్‌లోనూ నియామకాలు కొనసాగిస్తామని తెలిపింది. అయితే, కొందరు ఫ్రెషర్లకు ఆఫర్‌ లెటర్లు ఇచ్చినప్పటికీ.. చేర్చుకునే విషయంలో విప్రో జాప్యం చేస్తోందంటూ వచ్చిన వార్తలనూ సైతం అంగీకరించింది. ఆన్‌బోర్డింగ్‌ విషయంలో తమ హామీని నిలబెట్టుకుంటామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని