ఎన్‌పీఎస్‌లో మారిన‌ న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ నిబంధ‌నలు ఇవే!

ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం జీవితం సాఫీగా గ‌డిచేందుకు జాతీయ పింఛ‌ను ప‌థ‌కంలో మ‌దుపు చేయ‌డం ఉద్యోగుల‌కు ఎంత‌గానో తోడ్ప‌డుతుంది. ప్ర‌భుత్వ ప్రాయోజిత ప‌థ‌కమైన ఎన్‌పీఎస్‌లో పెట్టిన డ‌బ్బుల‌ను కొన్ని నిబంధ‌న‌ల‌కనుగుణంగా పాక్షికంగా ఉప‌సంహ‌ర‌ణ చేసుకోవ‌చ్చు.....

Updated : 02 Jan 2021 16:35 IST

ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం జీవితం సాఫీగా గ‌డిచేందుకు జాతీయ పింఛ‌ను ప‌థ‌కంలో మ‌దుపు చేయ‌డం ఉద్యోగుల‌కు ఎంత‌గానో తోడ్ప‌డుతుంది. ప్ర‌భుత్వ ప్రాయోజిత ప‌థ‌కమైన ఎన్‌పీఎస్‌లో పెట్టిన డ‌బ్బుల‌ను కొన్ని నిబంధ‌న‌ల‌కనుగుణంగా పాక్షికంగా ఉప‌సంహ‌ర‌ణ చేసుకోవ‌చ్చు. పిల్ల‌ల పెళ్లిల్లు, ఇంటి కొనుగోలు, ఆరోగ్య చికిత్స‌ల కోసం న‌గ‌దును ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. తాజాగా ఉన్న‌త విద్య‌, కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు కూడా న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవ‌చ్చ‌ని పీఎఫ్ఆర్‌డీఏ ప్ర‌క‌టించింది. న‌గదు ఉపసంహ‌ర‌ణ‌ల‌కు సంబంధించి గ‌త కొంత కాలంగా పీఎఫ్ఆర్‌డీఏ ఎన్నో కొత్త నిబంధ‌న‌ల‌ను తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్‌పీఎస్‌లో న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌కు సంబంధించి 10 ముఖ్య‌మైన విష‌యాలు

  1. ప‌థ‌కంలో చేరిన మూడేళ్ల త‌ర్వాత మాత్ర‌మే డ‌బ్బులు ఉపసంహ‌రించుకోవాల్సి ఉంటుంది. చందాదారుడు త‌న వంతుగా చెల్లించిన మొత్తంలో 25 శాతం లోపు మాత్ర‌మే విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

  2. ఎన్‌పీఎస్‌లో రెండు ర‌కాల ఖాతాలుంటాయి. అవి టైర్‌-1, టైర్‌-2 ఖాతాలు. ల‌బ్ధిదారునికి 60 ఏళ్లు వ‌చ్చేంత వ‌ర‌కూ టైర్‌-1 ఖాతాలో న‌గ‌దు ఉప‌సంహ‌రించుకునేందుకు అనుమతి లేదు. కొన్ని ప్రత్యేక సంద‌ర్భాల్లో మాత్రం పాక్షికంగా ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు.

  1. టైర్‌-2 ఖాతా సాధార‌ణ పొదుపు ఖాతా లాంటిదే. ఇందులో డ‌బ్బుని చందాదారులు త‌మ అవ‌స‌రాల మేర‌కు ఎప్పుడైనా వెన‌క్కి తీసుకోవ‌చ్చు.

  2. చందాదారులు త‌మ వంతుగా చెల్లించిన మొత్తంలో మాత్ర‌మే 25 శాతం వ‌ర‌కు న‌గ‌దు ఉప‌సంహ‌రించుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉద్యోగి సంస్థ యాజమాన్యం చెల్లించిన మొత్తం ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోరు.

  3. జ‌న‌వ‌రి10, 2018 నాడు పీఎఫ్ఆర్‌డీఏ నోటిఫై చేసిన‌ ఉత్త‌ర్వుల ప్ర‌కారం పిల్ల‌ల ఉన్న‌త‌ విద్య( చ‌ట్ట‌బ‌ద్ధంగా దత్త‌త తీసుకున్న పిల్ల‌ల‌తో స‌హా) కోసం పాక్షికంగా డ‌బ్బులు ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు.

  4. పిల్ల‌ల పెళ్లిల్లు( చ‌ట్ట‌బ‌ద్ధంగా దత్త‌త తీసుకున్న పిల్ల‌ల‌తో స‌హా) కోసం కూడా పాక్షికంగా డ‌బ్బులు ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు.

  5. ఉద్యోగి త‌న పేరు మీద లేదా జీవిత భాగ‌స్వామి పేరు మీద ఇళ్లు, ఫ్లాట్ కొనుగోలు కోసం పాక్షికంగా డ‌బ్బులు వెన‌క్కి తీసుకోవ‌చ్చు. అయితే ఇప్ప‌టికే అత‌ని పేరు మీద లేదా ఉమ్మ‌డిగా లేదా వార‌సత్వంగా ఏదైనా స్థిరాస్తి ఉన్నా న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌ను అనుమ‌తించ‌రు.

  6. పీఎఫ్ఆర్‌డీఏ నోటిఫై చేసిన కొన్ని వ్యాధుల‌కు చికిత్స నిమిత్తం పాక్షికంగా డ‌బ్బు వెన‌క్కి తీసుకునే వెసులుబాటు ఉంది. చందాదారుడు త‌న‌కు గానీ, జీవిత భాగ‌స్వామి, పిల్ల‌లు( చ‌ట్ట‌బ‌ద్ధం660గా దత్త‌త తీసుకున్న పిల్ల‌ల‌తో స‌హా), త‌న‌పై ఆధార‌ప‌డిన వారికి ఆరోగ్య చికిత్స‌ల నిమిత్తం న‌గ‌దు ఉపసంహ‌ర‌ణ చేసుకోవ‌చ్చు. క్యాన్స‌ర్‌, కిడ్నీ ఫెయిల్యూర్‌, హైప‌ర్ టెన్ష‌న్‌, మ‌ల్టీపుల్ స్క్లీరోసిస్‌, కోమా, అంధ‌త్వం వంటి తీవ్ర‌మైన వ్యాధుల‌కు చికిత్స కోసం డ‌బ్బులు వెన‌క్కి తీసుకోవ‌చ్చ‌ని పీఎఫ్ఆర్‌డీఏ ఉత్త‌ర్వులు విడుద‌ల చేసింది.

  7. చందాదారుడు ఎన్‌పీఎస్‌లో గ‌రిష్టంగా మూడు సార్లు మాత్ర‌మే న‌గదు ఉప‌సంహ‌రించుకునే వీలుంది. ఎన్‌పీఎస్ నోడ‌ల్ కార్యాల‌యం లేదా కేంద్ర రికార్డుల నిర్వ‌హ‌ణ సంస్థ ద్వారా చందాదారులు డ‌బ్బుని వెన‌క్కి తీసుకునేందుకు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.

  8. స‌బ్‌క్లాజ్‌(డీ) లో నిర్ధేశించిన ప్ర‌కారం చందాదారుడు ఏదైనా తీవ్ర‌మైన వ్యాధుల బారిన ప‌డి చికిత్స తీసుకుంటూ న‌గ‌దు ఉప‌సంహ‌రించుకోలేని ప‌రిస్థితుల్లో ఉంటే అత‌ని త‌ర‌పున కుటుంబ స‌భ్యులు డ‌బ్బుని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని