అక్కడ కంపెనీ బోర్డుల్లో మహిళలు ఉండాల్సిందే

ఉన్నత హోదాల్లో లింగ వివక్షను రూపుమాపేలా జర్మనీ ప్రభుత్వం చారిత్రక చట్టం తీసుకొస్తోంది. లిస్టెడ్‌ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌ బోర్డుల్లో తప్పనిసరిగా మహిళలు ఉండేలా

Published : 06 Jan 2021 20:00 IST

బెర్లిన్: ఉన్నత హోదాల్లో లింగ వివక్షను రూపుమాపేలా జర్మనీ ప్రభుత్వం చారిత్రక చట్టం తీసుకొస్తోంది. లిస్టెడ్‌ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌ బోర్డుల్లో తప్పనిసరిగా మహిళలు ఉండేలా రూపొందించిన బిల్లుకు అక్కడి పార్లమెంట్‌ ఆమోదముద్ర వేసింది. నూతన మూసాయిదా చట్టం ప్రకారం.. నలుగురు అంతకంటే ఎక్కువ ఎగ్జిక్యూటివ్‌లు ఉండే లిస్టెడ్‌ కంపెనీలు కనీసం ఒక మహిళను బోర్డు సభ్యురాలిగా నియమించాల్సి ఉంటుంది. 

యూరప్‌ దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీలో మహిళలకు ఉన్నత హోదా అనేది అంతంతమాత్రంగానే ఉంది. ఆ దేశ లిస్టెడ్‌ కంపెనీల్లో కేవలం 12.8శాతం మేనేజ్‌మెంట్‌ బోర్డు సభ్యులు మాత్రమే మహిళలు. అదే అమెరికాలో 28.6శాతం, బ్రిటన్‌లో 24.5శాతం, ఫ్రాన్స్‌లో 22.2శాతం మంది మహిళలు కంపెనీల్లో మేనేజ్‌మెంట్‌ బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఇక జర్మనీలో మహిళ సగటు ఆదాయం కూడా పురుషులతో పోలిస్తే 20శాతం తక్కువగా ఉంది. దీంతో ఉన్నత హోదాల్లో లింగ వివక్షను తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని రూపొందించింది. మేనేజ్‌మెంట్‌ బోర్డుల్లో మహిళలు తప్పనిసరిగా ఉండాలంటూ బిల్లును ఆమోదించింది. 

ఇవీ చదవండి..

7.3 సెకన్లలోనే 100 కి.మీ వేగం

విరాళాలు ఇవ్వడంలోనూ అగ్రస్థానమే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని