Investment: మహిళలూ.. సొంతంగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా?

పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఓపిక, క్రమశిక్షణ కలిగి ఉండడంతో పాటు మంచి రిస్క్ మేనేజర్లుగా కూడా వ్యవహరిస్తారు

Updated : 28 Apr 2022 16:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగం చేస్తున్న మహిళల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. పురుషులతో సమానంగా మహిళలు కూడా అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. కొన్ని రంగాల్లోని మహిళలలైతే, పురుషుల కంటే ఎక్కువ మొత్తంలో జీతాలను పొందుతున్నారని కొన్ని సర్వేలు  చెబుతున్నాయి. అయితే, పెట్టుబడి విషయానికి వచ్చే సరికి మాత్రం అనేక మంది మహిళలు తమ నిర్ణయాలను తండ్రి లేదా సోదరుడు లేదా భర్తకు వదిలివేయడానికి ఇష్టపడుతున్నారు.

పెట్టుబడి అనేది డబ్బు సంపాదించడానికి ఉన్న బలమైన మార్గం. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఓపిక, క్రమశిక్షణ కలిగి ఉండడంతో పాటు మంచి రిస్క్ మేనేజర్లుగా కూడా వ్యవహరిస్తారు. కాబట్టి ఒక మహిళ ప్రతి నెలా తన ఆదాయంలో కొంత మొత్తాన్ని ఆదా చేసి దానిని కొన్ని రకాల పెట్టుబడి మార్గాల్లో పెట్టుబడిగా పెట్టడం ప్రారంభించవచ్చు. అలా పొదుపు చేసిన మొత్తాన్ని పిల్లల చదువులకు, ఇల్లు, వాహన కొనుగోళ్లకు, విహారయాత్రలకు వెళ్లడానికి లేదా మరేదైనా భవిష్యత్తు అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించడంలో మహిళలకు సహాయపడే కొన్ని చిట్కాలను కింద తెలియజేశాం..

  • పెట్టుబడి పెట్టడం ప్రారంభించే ముందు, మహిళలు ఆర్థిక విషయాల గురించి అవగాహన చేసుకోవాలి. దాని కోసం కొన్ని రకాల పుస్తకాలను చదవడం, నేర్చుకోవడం ప్రారంభించండి. మార్కెట్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలనే విషయాలపై కొన్ని ఆర్థిక సంస్థలు శిక్షణా తరగతులను నిర్వహిస్తుంటాయి. వాటిలో చేరి శిక్షణ తీసుకోవచ్చు.
  • మీరు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభించాలి. భవిష్యత్‌లో మీకు ఏ అవసరానికి డబ్బు కావాలో ముందే అంచనా వేసినట్లైతే, అది మీకు సరైన పెట్టుబడి ప్రణాళికను రూపొందించడంలో సహాయపడుతుంది.
  • ర్థిక సలహాదారుల సాయం తీసుకొని మరింత క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో లో రిస్క్, మీడియం రిస్క్ పెట్టుబడి ఎంపికలతో పాటు, హై రిస్క్ ఎంపికలను కూడా ఉండేలా చూసుకోవడం మంచిది. హై రిస్క్ ఎంపికలు మెరుగైన రాబడిని అందించవచ్చు, అదే మార్కెట్లు ఒడుదొడుకులకు లోనైనప్పుడు మాత్రం తక్కువ రిస్క్ ఎంపికలు మరింత ఫలవంతంగా ఉంటాయి. అందువల్ల పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక సలహాదారుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.
Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని