India GDP: భారత్‌ వృద్ధి రేటు అంచనాలను సవరించిన ప్రపంచబ్యాంక్‌

భారత జీడీపీ (GDP) వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ (World Bank) సవరించింది. భారత్‌ ఆర్థిక వ్యవస్థ రాణిస్తుండడంతో గతంలో తగ్గించిన అంచనాలను తాజాగా మెరుగుపరిచింది.

Published : 06 Dec 2022 14:59 IST

దిల్లీ: భారత జీడీపీ (GDP) వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ (World Bank) సవరించింది. భారత్‌ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తుండడంతో గతంలో తగ్గించిన అంచనాలను తాజాగా మెరుగుపరిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతం వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేసింది. ప్రపంచ పరిణామాలను తట్టుకుని భారత్‌ ఆర్థిక వ్యవస్థ రాణిస్తోందని ఈ సందర్భంగా పేర్కొంది.

ఈ ఏడాది అక్టోబర్‌లో భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది. అయితే, ప్రపంచ షాకుల నుంచి తట్టుకుని రెండో త్రైమాసికంలో మెరుగైన గణాంకాలు వెలువరించడంతో అంచనాలను సవరించినట్లు ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 7.1 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని