WPI inflation: ఏప్రిల్‌లో 34 నెలల కనిష్ఠ స్థాయికి టోకు ద్రవ్యోల్బణం

WPI inflation: బేసిక్‌ మెటల్స్‌, ఆహార ఉత్పత్తులు, ఖనిజ నూనెలు, వస్త్రాలు, ఆహారేతర పదార్థాలు, కెమికల్‌ & వాటి ఉత్పత్తులు, రబ్బర్‌, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, పేపర్‌- దాని ఉత్పత్తుల ధరల పెరుగుదల నెమ్మదించడం వల్లే ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది.

Published : 15 May 2023 13:47 IST

దిల్లీ: టోకు ద్రవ్యోల్బణ రేటు (WPI inflation) ఏప్రిల్‌లో 34 నెలల కనిష్ఠానికి చేరింది. ఆహారం, ఇంధనం, తయారీ వస్తువుల ధరలు తగ్గడం అందుకు దోహదం చేసింది. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ గత నెల (-)0.92 శాతంగా నమోదైంది. గత 11 నెలలుగా టోకు ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది.

గత ఏడాది మార్చిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం (WPI inflation) 1.34 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ నాటికి అది 15.38 శాతానికి చేరింది. గత నెల ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 3.54 శాతానికి తగ్గింది. అది మార్చిలో 5.48 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. బేసిక్‌ మెటల్స్‌, ఆహార ఉత్పత్తులు, ఖనిజ నూనెలు, వస్త్రాలు, ఆహారేతర పదార్థాలు, కెమికల్‌ & వాటి ఉత్పత్తులు, రబ్బర్‌, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, పేపర్‌- దాని ఉత్పత్తుల ధరల పెరుగుదల నెమ్మదించడం వల్లే ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది.

ఇంధనం, విద్యుత్‌ బాస్కెట్‌ ద్రవ్యోల్బణం మార్చిలో 8.96 శాతంగా ఉండగా.. అది ఏప్రిల్‌ నాటికి 0.93 శాతానికి తగ్గింది. తయారీ ఉత్పత్తుల ధరల పెరుగుదల రేటు 0.77 శాతం నుంచి (-)2.42 శాతానికి తగ్గింది. ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠ స్థాయి 4.70 శాతానికి తగ్గడంతో డబ్ల్యుపీఐలో తగ్గుదల ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని