WPI Infaltion: వరుసగా 11వ నెలా రెండంకెల్లో టోకు ద్రవ్యోల్బణం

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 11వ నెల రెండంకెల్లో నమోదైంది....

Published : 14 Mar 2022 17:28 IST

దిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 11వ నెల రెండంకెల్లో నమోదైంది. ఫిబ్రవరిలో డబ్ల్యూపీఐ సూచీ 13.11 శాతంగా నమోదైంది. క్రితం నెల ఇది 12.96 శాతంగా ఉంది. ఇక గత ఏడాది ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 4.83 శాతంగా నమోదైంది. ఆర్‌బీఐ ద్రవ్య విధాన రూపకల్పనల్లో రిటైల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణాన్ని (CPI) పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే, టోకు ద్రవ్యోల్బణం పెరిగితే ఆ ప్రభావం రిటైల్‌ ధరలపై ప్రత్యక్షంగా ఉంటుంది. జనవరితో పోలిస్తే తయారీ వస్తువుల ధరలు పెరగడమే ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణం ఎగబాకడానికి కారణం.


ఫిబ్రవరిలో దేశ ఎగుమతులు 25.1 శాతం పెరిగి 34.57 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2.64 లక్షల కోట్ల)కు చేరాయి. దిగుమతులు సైతం 36 శాతం పెరిగి 55.45 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.4.24 లక్షల కోట్ల)కు పెరిగాయి. ఫలితంగా వాణిజ్య లోటు 20.88 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.59 లక్షల కోట్ల)కు చేరింది. బంగారం దిగుమతులు మాత్రం ఫిబ్రవరిలో 6.95 శాతం తగ్గి 4.8 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

* ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల దిగుమతులు ఫిబ్రవరిలో 29.53 శాతం తగ్గి 6.27 బిలియన్ డాలర్లకు చేరాయి

* ఇంజినీరింగ్‌, పెట్రోలియం, రసాయనాల ఎగుమతులు వరుసగా 32 శాతం పెరిగి 9.32 బి.డాలర్లకు, 88.14 శాతం పెరిగి 04.64 బి.డాలర్లకు, 25.38 శాతం పెరిగి 9.32 బి.డాలర్లకు చేరాయి.

* ఔషధాల ఎగుమతులు 1.78 శాతం తగ్గి 1.96 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని