ఎక్స్‌ ఇండియా హెడ్‌ రాజీనామా.. కారణమిదేనా?

Samiran Gupta: ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం ‘ఎక్స్‌’ ఇండియా, సౌత్‌ ఏషియా పాలసీ హెడ్‌గా విధులు నిర్వహిస్తున్న సమీరన్‌ గుప్తా తన పదవి నుంచి వైదొలిగారు.

Published : 23 Sep 2023 15:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఇండియా, సౌత్‌ ఏషియా పాలసీ అధిపతి సమీరన్‌ గుప్తా (Samiran Gupta) తన పదవి నుంచి వైదొలిగారు. సంబంధిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. కోర్టు వివాదాలు, వచ్చే ఏడాది దేశంలో ఎన్నికలు జరగనున్న వేళ ఎక్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఓ వ్యక్తి నిష్క్రమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై స్పందించేందుకు ఎక్స్‌ నిరాకరించింది.

ఒక్క రోజులోనే ఆంధ్రా ఊటీ అందాలు చూసొస్తారా?.. IRCTC టూర్‌ ప్యాకేజీ వివరాలు ఇవే..!

2022 ఫిబ్రవరిలో ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ICANN) నుంచి సమీరన్‌ గుప్తా ‘ఎక్స్‌’లో చేరారు. అంటే మస్క్‌ ‘ఎక్స్‌’ను కొనుగోలు చేయకముందు నుంచే సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. సంస్థలో కీలకమైన కంటెంట్-సంబంధిత విధాన సమస్యలకు గుప్తా బాధ్యత వహిస్తున్నారు. అయితే, కంటెంట్‌ తొలగింపు విషయంలో ఎక్స్‌, భారత ప్రభుత్వం మధ్య న్యాయపోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. అనేకమార్లు కంటెంట్‌ తొలగించాలని తాము సూచించినా ఎక్స్‌ తొలగించడం లేదన్నది ప్రభుత్వ ఆరోపణ. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికలు వేళ కంటెంట్‌ విషయంలో మున్ముందు ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఉద్దేశంతో సమీరన్‌ తన పదవికి రాజీనామా చేసి ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని