Xiaomi 14 Civi: డ్యూయల్‌ సెల్ఫీ కెమెరాతో షావోమీ కొత్త మొబైల్‌.. ధర ఎంతంటే?

Xiaomi 14 Civi: షావోమీ తన 14 లైనప్‌లో కొత్త మొబైల్‌ను భారత్‌ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ మొబైల్‌ ధర, ఫీచర్ల వివరాలు చూసేయండి.

Updated : 12 Jun 2024 17:45 IST

Xiaomi 14 Civi| ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ షావోమీ (Xiaomi) తన 14 సిరీస్‌లో మరో కొత్త మొబైల్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. షావోమీ 14 సివి (Xiaomi 14 Civi) పేరిట దీన్ని ప్రవేశపెట్టింది. స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జెన్‌3 ప్రాసెసర్‌, ట్రిపుల్‌ కెమెరా సెటప్‌, కర్వ్‌డ్‌ డిస్‌ప్లే.. వంటి ఫీచర్లతో తీసుకొచ్చిన మొబైల్‌ ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.  

షావోమీ 14 సివి ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.42,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+512జీబీ వేరియంట్‌ ధర రూ.47,999గా పేర్కొంది. క్రూయిజ్‌ బ్లూ, మ్యాచా గ్రీన్, షాడో బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. జూన్‌ 20 మధ్యాహ్నం 12 నుంచి వీటి విక్రయాలు ప్రారంభం అవుతాయని పేర్కొంది. ఎంఐ వెబ్‌సైట్‌, స్టోర్‌లతో పాటు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. ప్రీ బుకింగులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని.. ముందుగానే రిజర్వ్‌ చేసుకున్నవారికి రెడ్‌మీ 3 యాక్టివ్‌ను ఉచితంగా అందించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.3 వేలు డిస్కౌంట్‌ ఇవ్వనుంది. దీంతో పాటు మూడు నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, ఆరు నెలల పాటు 100జీబీ గూగుల్‌ వన్‌ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు షావోమీ తెలిపింది.

ఆధార్‌- రేషన్‌ కార్డ్‌ అనుసంధానం గడువు 3 నెలలు పొడిగింపు

షావోమీ 14 సివీ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌ 6.55 అంగుళాల 1.5K కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హైపర్‌ఓఎస్‌తో పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్‌ రేటు, 240Hz టచ్‌శాంప్లింగ్‌ రేట్‌, 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంటుంది. ఇందులో 50 ఎంపీ ఓఐఎస్‌ కెమెరా, 50 ఎంపీ టెలిఫొటో, 12 ఎంపీ అల్ట్రావైడ్‌ రియర్‌ కెమెరా సెటప్‌ ఇచ్చారు. ముందువైపు రెండు 32 ఎంపీ కెమెరాలు అమర్చారు. 4,700mAh బ్యాటరీ, 67W వైర్డ్‌ ఛార్జింగ్‌కి సపోర్ట్‌ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లోనే 80శాతం ఛార్జింగ్‌ పూర్తవుతుందని కంపెనీ చెబుతోంది. 5జీ, వైఫై 6, బ్లూటూత్‌ 5.4, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, బైడూ, గ్లోనాస్‌, గెలీలియో, యూఎస్‌బీ టైప్‌-సి పోర్టు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు