Xiaomi-Jio: షావోమీ ఫోన్లలో ఇక జియో ట్రూ 5జీ సేవలు.. స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్ ఇదే..
Jio True 5G On Xiaomi smartphones: జియో 5జీ సేవలకు సంబంధించి షావోమీ సాఫ్ట్వేర్ అప్డేట్ను విడుదల చేసింది. లిస్ట్‌లో ఉన్న ఉన్న ఫోన్ వినియోగదారులు సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవడం ద్వారా ట్రూ 5జీ సేవలను ఆనందించొచ్చు.
దిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమీ ఇండియా (Xiaomi India) టెలికాం కంపెనీ రిలయన్స్‌తో జియోతో (Jio) భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తమ వినియోగదారులకు జియో ట్రూ 5జీ సేవలను అందించేందుకు సాఫ్ట్వేర్ అప్డేట్ను విడుదల చేసింది. ఇకపై తమ స్మార్ట్ఫోన్లు జియో స్టాండలోన్ (SA) నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తాయని షావోమీ తెలిపింది.
ఈ భాగస్వామ్యం ద్వారా షావోమీ, రెడ్మీకి చెందిన అన్ని స్మార్ట్ఫోన్లలో 5జీ కనెక్టివిటీతో పాటు అంతరాయం లేని వీడియో స్ట్రీమింగ్, హై రిజల్యూషన్ వీడియో కాల్స్, తక్కువ లేటెన్సీ కలిగిన గేమింగ్‌ను ఆనందించొచ్చు. ఇందుకోసం షావోమీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు సెట్టింగ్స్‌లో జియో ట్రూ 5జీ స్టాండలోన్ (SA) నెట్‌వర్క్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ భాగస్వామ్యం వల్ల షావోమి, రెడ్మీ వినియోగదారులు బెస్ట్ 5జీ సేవలను పొందొచ్చని ఆ కంపెనీ ఇండియా ప్రెసిడెంట్ బి మురళీకృష్ణ అన్నారు. కొత్తగా రాబోయే అన్ని షావోమీ 5జీ స్మార్ట్ఫోన్లూ జియో స్టాండలోన్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తాయని జియో ప్రెసిడెంట్ సునీల్ దత్ తెలిపారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న స్మార్ట్ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
స్మార్ట్‌ఫోన్ లిస్ట్ ఇదే..
ఎంఐ 11 అల్ట్రా 5జీ, షావోమీ 12 ప్రో 5జీ, షావోమీ 11టీ ప్రో 5జీ, రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ, షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ, రెడ్మీ నోట్ 11టీ 5జీ, రెడ్మీ 11 ప్రైమ్ 5జీ, రెడ్మీ నోట్ 10టీ 5జీ, ఎంఐ 11ఎక్స్ 5జీ, ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ, రెడ్మీ కె50i 5జీ, షావోమీ 11i 5జీ, షావోమీ 11ఐ హైపర్ ఛార్జ్ 5జీ
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా
-
World News
Pakistan: పౌరులకు పాకిస్థాన్ షాక్.. పెట్రోల్‌పై ఒకేసారి రూ.35 పెంపు!