Xiaomi New Devices: 36 గంటల ప్లేటైమ్‌తో బడ్స్‌.. పాకెట్‌ పవర్‌బ్యాంక్‌.. షావోమిలో ఐదు కొత్త ప్రోడక్ట్‌లు

Xiaomi new devices: షావోమి భారత్‌లోకి ప్రవేశించి పదేళ్లు పూర్తయింది. ఈసందర్భంగా ఐదు కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. వాటిలో ఫోన్స్‌, ఇయర్‌బడ్స్‌, పవర్‌బ్యాంక్‌, వాక్యూమ్‌ క్లీనర్‌లు ఉన్నాయి.

Published : 09 Jul 2024 16:02 IST

Xiaomi New Devices | ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత విపణిలోకి ప్రవేశించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా షావోమి కొత్త ఉత్పత్తులు విడుదల చేసింది. బడ్జెట్‌ ఫోన్‌తో పాటు వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌, రోబో వాక్యూమ్‌ క్లీనర్‌, రెండు పవర్‌బ్యాంకులు వీటిలో ఉన్నాయి. ఆయా ఉత్పత్తుల ధర, ఫీచర్లు సహా ఇతర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

రెడ్‌మీ బడ్స్‌ 5సీ..

రెడ్‌మీ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ (Redmi Buds 5C) 40dB యాక్టివ్ నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో వస్తున్నాయి. 12.4 ఎంఎం డైనమిక్‌ టైటానియం డ్రైవర్స్‌ ఉన్నాయి. ఏఐ ఈఎన్‌సీతో కూడిన క్వాడ్‌ మైక్‌ సెటప్‌ ఇచ్చారు. స్టాండర్డ్‌, ఎన్‌హాన్స్‌ బేస్‌, ఎన్‌హాన్స్‌ ట్రైబుల్‌, ఎన్‌హాన్స్‌ వాయిస్‌, కస్టమ్‌ మోడ్‌ అనే ఐదు సౌండ్‌ ప్రొఫైల్స్‌ ఉన్నాయి. ఛార్జింగ్‌ కేస్‌తో కలిపి 36 గంటల ప్లేటైమ్‌ ఉంటుందని కంపెనీ తెలిపింది. కేవలం బడ్స్‌ అయితే 7 గంటల వరకు ప్లేటైమ్‌ లభిస్తుందని పేర్కొంది. పది నిమిషాల్లో రెండు గంటల ప్లేటైమ్‌కు సరిపడా ఛార్జ్‌ అవుతుందని తెలిపింది. బ్లూటూత్‌ 5.3 కనెక్టివిటీ ఇచ్చారు. షావోమి ఇయర్‌బడ్స్‌తో టచ్‌ కంట్రోల్స్‌ను, ఏఎన్‌సీ మోడ్స్‌, ఈక్యూ సెట్టింగ్స్‌ను కస్టమైజ్‌ చేయొచ్చు. రెడ్‌మీ బడ్స్‌ 5సీ ధర రూ.1,999. అకౌస్టిక్‌ బ్లాక్‌, సింఫనీ బ్లూ, బేస్‌ వైట్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.


పాకెట్‌ పవర్‌బ్యాంక్‌..

షావోమి మరో రెండు కొత్త పవర్‌ బ్యాంక్‌లను (Redmi power banks) విడుదల చేసింది. 10,000mAh సామర్థ్యంతో ఒక పాకెట్‌ పవర్‌ బ్యాంక్‌ను తీసుకొచ్చింది. దీంట్లో టైప్‌-సి కేబుల్‌ను బిల్ట్‌-ఇన్‌గా ఇవ్వడం విశేషం. మల్టీ పోర్ట్‌ యాక్సెస్‌తో పాటు టూ-వే ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సామర్థ్యం ఉంది. మరోదాన్ని షావోమి పవర్‌బ్యాంక్‌ 4ఐ పేరిట తీసుకొచ్చింది. దీంతో మూడు డివైజ్‌లను ఒకేసారి ఛార్జ్‌ చేయొచ్చు. 10,000mAh సామర్థ్యంతో వస్తోన్న ఈ పవర్‌బ్యాంక్‌ టూ-వే ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ఈ రెండు పవర్‌బ్యాంక్‌లు 12 లేయర్ల రక్షణ వ్యవస్థతో వస్తున్నాయి. 22.5W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తాయి. పాకెట్‌ పవర్‌ బ్యాంక్‌ ధర రూ.1,699. 4ఐ ధర రూ.1,299.


రోబో వాక్యూమ్‌ క్లీనర్‌..

షావోమి మరో కొత్త రోబో వాక్యూమ్‌ క్లీనర్‌ ఎక్స్‌10 (Xiaomi Robot Vacuum Cleaner X10) మోడల్‌ను సైతం ప్రవేశపెట్టింది. దుమ్మును వేగంగా సేకరించడం, డ్యూయల్‌ ఆటో-ఎంప్టీయింగ్‌ వెంట్స్‌, 2.5 లీటర్ల సామర్థ్యంతో కూడిన డిస్పోజబుల్‌ బ్యాగ్‌ వంటి అంశాలతో దీన్ని మెరుగుపర్చినట్లు పేర్కొంది. ఎల్‌డీఎస్‌ లేజర్‌ నావిగేషన్‌తో క్లీన్‌ చేయాల్సిన ప్రాంతాన్ని అత్యంత కచ్చితత్వంతో గుర్తిస్తుందని కంపెనీ తెలిపింది. 4,000Pa సక్షన్‌ పవర్‌తో వస్తోన్న ఈ క్లీనర్‌ మరకలను, దుమ్మును వివిధ రకాల ఉపరితలాలపై చాలా సులభంగా తొలగిస్తుందని కంపెనీ తెలిపింది. 5,200mAh బ్యాటరీని ఇచ్చారు. 240 నిమిషాల పాటు క్లీన్‌ చేయొచ్చని కంపెనీ తెలిపింది. దీన్ని షావోమి హోమ్‌ యాప్‌ ద్వారా నియంత్రించొచ్చు. దీని ధర రూ.29,999.


ఎస్‌యూ 7 కారు..

ఈసందర్భంగా షావోమి తమ ఎస్‌యూ7 కారును సైతం భారత కస్టమర్లకు పరిచయం చేసింది. ఈ కారు ఎస్‌యూ 7, ఎస్‌యూ7 మ్యాక్స్‌ పేరిట రెండు వేరియంట్లలో లభించనుంది. ఎస్‌యూ 7 విషయానికి వస్తే.. 0-100 kmph వేగాన్ని 5.28 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 668 కిలోమీటర్లు వెళ్తుంది. గరిష్ఠ వేగం 210 కి.మీ/గం. అత్యధికంగా 400 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 299 పీఎస్‌ శక్తిని విడుదల చేస్తుంది. మరోవైపు ఎస్‌యూ7 మ్యాక్స్‌ 2.78 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని గరిష్ఠ వేగం 265 కి.మీ/గం. 838 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 673 పీఎస్‌ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని