Yamaha Motors: యమహా నుంచి కొత్త ఏరాక్స్‌ 155

2023 యమహ ఏరెక్స్‌ 155 టీసీఎస్‌ కొత్త వెర్షన్‌ నేడు భారతదేశ మార్కెట్‌లో ప్రారంభమయ్యింది.

Published : 07 Apr 2023 17:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యమహా మోటార్‌ ఇండియా ఏరాక్స్‌ 155 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ మాక్సీ-స్కూటర్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.1.43 లక్షలుగా నిర్ణయించింది. ఈ స్కూటర్‌ మెటాలిక్‌ బ్లాక్‌, రేసింగ్‌ బ్లూ, గ్రే వెర్మిలియన్‌, మెటాలిక్‌ సిల్వర్‌.. నాలుగు కలర్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. యమహా ఏరాక్స్‌ 155 సీసీ, సింగిల్‌ సిలిండర్‌తో కూడిన వాహనం. దీని ఇంజిన్‌ ఓబీడీ-2తో వస్తోంది. ఈ20 ఇంధనంతో కూడా నడుస్తుంది. స్కూటర్‌ ముందు భాగంలో డిస్క్‌ బ్రేక్‌, వెనుక భాగంలో డ్రమ్‌ యూనిట్‌ ఉంటుంది. ఇది బ్లూ-టూత్‌ కనెక్టివిటీతో కూడిన డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను కలిగి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని