Yatra Online: యాత్ర ఆన్‌లైన్‌ ఐపీఓకు సెబీ అనుమతి

యాత్ర ఆన్‌లైన్‌ ఐపీఓకు సెబీ అనుమతి ఇచ్చింది. త్వరలో ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది.

Published : 19 Nov 2022 13:50 IST

దిల్లీ: ప్రయాణ సేవలు అందించే యాత్ర ఆన్‌లైన్‌ Inc భారత అనుబంధ విభాగం యాత్ర ఆన్‌లైన్‌ లిమిటెడ్‌ (Yatra Online) ఐపీఓ (IPO)కు  మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) అనుమతి ఇచ్చింది. ఐపీఓకు సంబంధించి ఈ ఏడాది మార్చిలో యాత్ర ముసాయిదా పత్రాలను సమర్పించగా.. నవంబర్‌ 17న సెబీ నుంచి అబ్జర్వేషన్‌ లెటర్‌ను అందుకుంది. ఈ లెటర్‌ అందుకున్న 12 నెలల్లోగా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు రావాల్సి ఉంటుంది. ఐపీఓలో భాగంగా మొత్తం రూ.750 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 93,28,358 ఈక్విటీ షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఉంచనన్నారు.

ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను వ్యూహాత్మక పెట్టుబడులు, కొనుగోళ్లు, సంస్థ విస్తరణ కార్యకలాపాలు, కస్టమర్లను పెంచుకోవడం, సాధారణ కార్పొరేట్‌ అవసరాలు వంటి వాటికి వినియోగించనున్నారు. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌, డీఏఎం క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ లిమిటెడ్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ లీడ్‌ మేనేజర్లుగా ఉన్నాయి. యాత్ర ఆన్‌లైన్‌ ఇంక్‌ ఇప్పటికే అమెరికాలోని నాస్డాక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్టయింది. భారత్‌లో అతిపెద్ద కార్పొరేట్‌ ట్రావెల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా ప్రస్తుతం యాత్ర కొనసాగుతోంది. సుమారు 700 పెద్ద కార్పొరేట్‌ కస్టమర్లు,  46 వేల ఎస్‌ఎంఈ కస్టమర్లు కంపెనీకి ఉన్నారు. బస్సులు, విమానాలు, హోటళ్లు తదితర వాటిని యాత్ర ద్వారా బుక్‌ చేసుకోవచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts