Yatra Online IPO: ఐపీఓ కోసం యాత్రా ఆన్‌లైన్‌ లిమిటెడ్‌ దరఖాస్తు!

ప్రముఖ ప్రయాణ సేవల సంస్థ యాత్రా ఆన్‌లైన్‌ లిమిటెడ్‌ ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది....

Updated : 28 Mar 2022 12:36 IST

దిల్లీ: ప్రముఖ ప్రయాణ సేవల సంస్థ యాత్రా ఆన్‌లైన్‌ లిమిటెడ్‌ ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు శనివారం సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. రూ.750 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 93,28,358 ఈక్విటీ షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉంచనుంది. వ్యూహాత్మక పెట్టుబడులు, కొనుగోళ్లు, సంస్థ విస్తరణ కార్యకలాపాలకు ఐపీఓ నిధులను వినియోగించనుంది. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌, డీఏఎం క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ లిమిటెడ్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ లీడ్‌ మేనేజర్లుగా ఉన్నాయి. యాత్రా ఆన్‌లైన్ లిమిటెడ్‌ మాతృసంస్థ ‘యాత్రా ఆన్‌లైన్‌ ఇంక్‌’ ఇప్పటికే అమెరికాలోని నాస్డాక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్టయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని