ఇక్క‌డి నుంచే అక్క‌డ పెట్టుబ‌డి చేయొచ్చు

విదేశీ ఈక్విటీల్లో పెట్టుబ‌డులు చేయ‌డం ఎలాగో తెలుసుకుందాం...

Published : 18 Dec 2020 13:26 IST

విదేశీ ఈక్విటీల్లో పెట్టుబ‌డులు చేయ‌డం ఎలాగో తెలుసుకుందాం.

ప్ర‌స్తుతం విదేశీ స్టాకులు యాపిల్, అమెజాన్, ఆల్ఫాబెట్, ఫేస్ బుక్ షేర్లు జోరును కొన‌సాగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌న దేశంలో ఉంటూనే అక్క‌డి పెట్టుబ‌డి అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌డం సుల‌భ‌మేని మీకు తెలుసా?

విదేశీ పెట్టుబ‌డులు చేసేందుకు మార్గాలు:

విదేశీ కంపెనీల్లో మ‌దుపు చేయాలంటే ప్ర‌త్య‌క్షంగా లేదా ప‌రోక్షంగా ఏవైనా ఇత‌ర పెట్టుబ‌డి సాధ‌నాల ద్వారా మ‌దుపుచేయ‌వ‌చ్చు.

ప‌రోక్ష మార్గాలు:

  • విదేశీ కంపెనీల్లో పెట్టుబ‌డి చేసే ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లలో పెట్ట‌బ‌డి చేయ‌డం.
  • విదేశీ ఈటీఎఫ్ ల్లో మ‌దుపుచేసే ఫండ్ల‌లో మ‌దుపుచేయ‌డం. ఈ రెండూ నేరుగా కాకుండా కొన్ని పెట్టుబ‌డి సాధ‌నాల ద్వారా మ‌దుపు చేస్తున్న‌ట్లు అవుతుంది.

ప్ర‌త్య‌క్ష మార్గాలు:

దీనికి అంత‌ర్జాతీయ బ్రోకింగ్ సంస్థ‌లందించే డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా ఉండాలి. ప్ర‌స్తుతం వివిధ సంస్థ‌లు ప్రపంచ‌మంత‌టా పెట్టుబ‌డులు చేసేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ట్రేడింగ్ ఖాతాల‌ను అందిస్తున్నాయి.

  • విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల‌ను ఆధారంగా చేసుకునే ఈటీఎఫ్ ల్లో నేరుగా మ‌దుప‌ర్లు పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు.
  • నేరుగా విదేశీ షేర్లలో పెట్టుబ‌డి చేయ‌డం . అంటే అమెరికా ఎక్స్ఛేంజీలో లిస్ట‌యిన యాపిల్ అమెజాన్ కంపెనీల షేర్ల‌లో నేరుగా పెట్టుబ‌డి చేయ‌డం.

భార‌తీయ మ‌దుప‌ర్లు ఎంత‌వ‌ర‌కూ పెట్టుబ‌డి చేయొచ్చు?

రిజ‌ర్వు బ్యాంకు అనుమ‌తించిన ప‌రిమితి 2,50,000 డాల‌ర్లు . ఏవిధ‌మైన అనుమ‌తి లేకుండా ఒక భార‌తీయ మ‌దుప‌రి 2.5 ల‌క్ష‌ల డాల‌ర్ల వ‌ర‌కూ పెట్టుబ‌డుల‌ను చేయ‌వ‌చ్చు.

ఇలా వివిధ దేశాల్లో పెట్టుబ‌డి చేయ‌డం వ‌ల్ల లాభం ఏంటంటే…

ఇత‌ర దేశాల్లో చేసే పెట్టుబ‌డులతో కొంత న‌ష్ట‌భ‌యం త‌గ్గుతుంది.ఎందుకంటే దేశీయంగా ఉండే ప‌రిణామాలు ఆ దేశంలో చేసేపెట్టుబ‌డుల‌పై ప్ర‌భావం చూపుతాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఒక మ‌దుప‌రి అమెరికాలో లిస్టైన షేర్లతో పాటు భార‌త్ లో లిస్ట‌యిన షేర్ల‌లో మ‌దుపుచేశారు. అమెరికాలో వివిధ కార‌ణాల ద్వారా ఏమైనా స్థూల ఆర్థిక తీరుతెన్నుల్లో మార్పు వ‌చ్చిందంటే దాని ప్ర‌భావం ఆ దేశ స్టాక్ సూచీల‌పై ఉంటుంది. భార‌త్ లో ఏవిధ‌మైన సంక్ష‌భం ఏర్ప‌డ‌క‌పోవ‌డం మూలంగా ఆ మ‌దుప‌రి చేసిన భార‌త్ పెట్టుబ‌డి మంచి రాబ‌డిని అందించొచ్చు. ఒక వేళ భార‌త్ లో ఆర్థిక వ్య‌వ‌స్థ నెమ్మ‌దిస్తే అమెరికాలో బావుండొచ్చు ఈ విధంగా కొంత న‌ష్ట‌భ‌యం త‌గ్గుతుంద‌నే చెప్పాలి.

ప‌న్ను విధానం:

విదేశాల్లో పెట్టుబ‌డి చేస్తే ప‌న్ను ఎలా ఉంటుంద‌నేది ముందుగా తెలుసుకోవాలి. ప్ర‌స్తుతం ప‌రోక్షంగా విదేశీ ఈక్విటీ పెట్టుబ‌డులు చేసే వారికి ప‌న్ను దీర్ఘ‌కాలిక మూలధ‌న ఆదాయంపై వాటిపై ఇండెక్షేష‌న్ తో 20 శాతం ఉంటుంది. దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న ఆదాయంపై ఇండెక్షేష‌న్ తో 20 శాతం చెల్లించాల్సి ఉంటుంది. మ‌న దేశంలో ఈక్విటీ పెట్టుబ‌డులు అయితే దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న ఆదాయంపై ప‌న్ను(ఏడాదిపైబ‌డి) 10 శాతం ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ద్ర‌వ్యోల్బ‌ణ అంచ‌నాతో చూస్తే ఇండెక్షేష‌న్ తో 20 శాతం ప‌న్ను దాదాపుగా ఇండెక్షేష‌న్ లేకుండా 10 శాతం ప‌న్నుకు ద‌గ్గ‌ర‌గానే ఉంటుంది.

నేరుగా విదేశీ ఎక్స్చేంజీ ట్రేడెడ్ ఫండ్లు లేదా షేర్ల‌లో మ‌దుపుచేసే వారికి ఏడాదికి మించి కొనసాగించిన పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే ఆదాయాన్ని దీర్ఘ‌కాలిక‌ మూల‌ధ‌న ఆదాయం గా ప‌రిగ‌ణిస్తారు. దీనిపై ఇండెక్షేష‌న్ లేకుండా 20 శాతం చెల్లించాల్సి ఉంటుంది. స్వ‌ల్ప‌కాల మూల‌ధ‌న ఆదాయంపై వ్య‌క్తిగ‌త ప‌న్ను స్లాబు వ‌ద్ద‌ప‌న్ను చెల్లించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని