Bank Statement: ఇందుకోసమే ప్రతినెలా బ్యాంక్ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోవాలి!
Bank Statement: ప్రతినెలా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ని చెక్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలుంటాయి. ఏమైనా మోసపూరిత లావాదేవీలు జరిగితే వెంటనే గుర్తించి బ్యాంకుకు తెలియజేయొచ్చు. ఇవేగాక మరిన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: నిర్దిష్ట వ్యవధిలో జరిపిన లావాదేవీలకు సంబంధించిన వివరాలను బ్యాంక్ స్టేట్‌మెంట్ (Bank Statement) తెలియజేస్తుంది. ఉదాహరణకు మీరు ఎవరికైనా డబ్బులు బదిలీ చేస్తే.. దాని ధ్రువీకరణ కోసం ఆరోజు స్టేట్‌మెంట్ చూస్తే సరిపోతుంది. మరి బ్యాంక్ స్టేట్‌మెంట్ (Bank Statement) ద్వారా ఎలాంటి వివరాలు తెలుసుకోవచ్చు? ఎంత కాలానికి ఒకసారి తనిఖీ చేసుకోవాలి? ఉపయోగాలేంటి? వంటి వివరాలు తెలుసుకుందాం..
భవిష్యత్‌లో గందరగోళం ఉండొద్దంటే..
చాలా మంది హడావుడిగా ఖర్చు చేసేస్తుంటారు. తర్వాత మర్చిపోతారు. కొంతకాలం గడిచిన తర్వాత డబ్బు ఎక్కడ ఖర్చైందో తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు తరచూ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేసుకోవడం వల్ల ఇలాంటి గందరగోళానికి తావుండదు. అందుకే ప్రతినెలా స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకుంటే ఖర్చులను ఎప్పటికప్పుడు నిర్ధారించుకునేందుకు అవకాశం ఉంటుంది. పైగా ముఖ్యమైన లావాదేవీల పక్కన చిన్న నోట్ రాసుకొని పెట్టుకుని భద్రపర్చుకుంటే.. భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది.
ఏయే ఛార్జీలు వేశారు..
బ్యాంకులు మనకు తెలియకుండానే అనేక ఛార్జీలను వసూలు చేస్తుంటాయి. వాటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి బ్యాంక్ స్టేట్‌మెంట్ అవసరం. ఒక్కోసారి సాంకేతిక కారణాల వల్ల బ్యాంకులు ఒకేరకమైన ఛార్జీని రెండుసార్లు కట్ చేస్తుంటాయి. వాటిని బ్యాంకు దృష్టికి తీసుకెళితే తప్పును సరిదిద్దే అవకాశం ఉంది. మనం చూసుకోకపోతే నష్టపోయినట్లే. డెబిట్ కార్డు, స్టేట్‌మెంట్లు, పాస్‌బుక్, క్రెడిట్ కార్డు, కనీస నగదు నిల్వ.. ఇలా అనేక రకాల ఛార్జీల వివరాలు స్టేట్‌మెంట్‌లో ఉంటాయి.
మోసపూరిత లావాదేవీల నివారణకు..
ఈ మధ్యకాలంలో మోసపూరిత లావాదేవీల సంఘటనలు పెరిగిపోతున్నాయి. వీటిని రుజువు చేయడానికి బ్యాంక్ స్టేట్‌మెంట్ ఓ ఆధారం. మనకు తెలియకుండా ఏదైనా మోసపూరిత లావాదేవీ జరిగితే.. దాన్ని స్టేట్‌మెంట్‌లో గుర్తించొచ్చు.
ఖర్చుల నియంత్రణకు..
డిజిటల్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ఖాతాలో ఎంత డబ్బుందో చూసుకోకుండానే ఖర్చు చేసేస్తున్నాం. ఒక్కోసారి స్థాయికి మించి ఖర్చు చేసేస్తుంటాం. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. దీన్ని నివారించడానికి బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను తరచూ చెక్ చేసుకోవడం ఒక మార్గం. ఎక్కడైనా అనవసర ఖర్చు చేస్తున్నట్లయితే దాన్ని నియంత్రించుకోవచ్చు. ఖర్చులు పెరిగిపోతున్నట్లు గుర్తించిన వెంటనే స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేసుకోవాలి. రెస్టారెంట్ బిల్లు, ఆన్‌లైన్ షాపింగ్.. వంటి వాటిని తగ్గించుకుంటే ఖర్చుల్ని అదుపులో పెట్టొచ్చు.
పెట్టుబడిగా మిగులు నిధులు..
వివిధ అవసరాలరీత్యా ఇప్పుడు ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నారు. అన్నింట్లోనూ ఎంతో కొంత డబ్బును ఉంచుతున్నారు. అవసరమైనప్పుడు డిపాజిట్ చేయడం, ఖర్చు చేయడం ఇలా జరిగిపోతోంది. అయితే, కొన్ని ఖాతాల్లో అలా డబ్బు మిగిలి ఉండిపోతుంటుంది. దాని గురించి ధ్యాసే ఉండదు. కానీ, తరచూ బ్యాంక్ స్టేట్‌మెంట్ చెక్ చేసుకుంటే.. ఏ ఖాతాలో ఎంత డబ్బు ఉందో ఒక ఐడియా ఉంటుంది. ఏమైనా మిగులు నిధులు ఉన్నట్లు గమనిస్తే దాన్ని మంచి రాబడి ఇచ్చే మార్గాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా ప్రతినెలా స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకుంటే.. అవసరాలు తీరిన తర్వాత ఖాతాలోనే ఉండిపోతున్న డబ్బును తీసి ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిది.
ప్రతినెలా స్టేట్‌మెంట్ తనిఖీ చేసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు చెక్ చేసుకోవాలి. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే స్టేట్‌మెంట్ చూసుకోవాలి. అవసరమైతే సంబంధిత ఆధారాలతో బ్యాంకును సంప్రదించాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train accident: మార్చురీల వద్దే భారీగా ‘గుర్తుపట్టని’ మృతదేహాలు.. భద్రపరచడం పెద్ద సవాలే!
-
Politics News
Anam: వైకాపా దుర్మార్గపు పాలనను అంతమొందించాలి: ఆనం రామనారాయణరెడ్డి
-
Sports News
Pat Cummins: అంతర్జాతీయ క్రికెట్ గుత్తాధిపత్యానికి ఐపీఎల్ ముగింపు పలికింది : ఆసీస్ కెప్టెన్
-
General News
Weather Report: తెలంగాణలో రాగల 3రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Jayanth C Paranjee: త్రిషకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడం వాళ్లకు నచ్చలేదు: జయంత్ సి.పరాన్జీ