యువ పెట్టుబడిదారులు మాంద్యం గురించి ఆందోళన చెందాలా?

ప్రతి మాంద్యం మార్కెట్లను మరింత గరిష్ట స్థాయికి ఎదగడానికి వీలు కల్పించింది....

Updated : 01 Jan 2021 17:24 IST

ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి “మాంద్యం” అనే పదం ముఖ్యాంశాలలో కనిపిస్తుంది. అలాంటి సమయంలో ప్రజలు తమ క్యాపిటల్ ను ఏ విధంగానైనా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రతి మాంద్యం మార్కెట్లను మరింత గరిష్ట స్థాయికి ఎదగడానికి వీలు కల్పించింది.ఇక పెట్టుబడుల విషయానికి వస్తే, మాంద్యాలను స్వల్పకాలిక బ్లిప్ అని పిలుస్తారు. యువత వారి వయస్సు కారణంగా మాంద్యాల వలన కలిగే నష్టాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. తదుపరి ఆర్థిక సంక్షోభం ఎప్పుడైనా రావచ్చు, కానీ మార్కెట్‌కు సమయం ఇవ్వడం సాధ్యం కాదు. దీర్ఘకాలిక పెట్టుబడుల రాబడి గ్రాఫ్ స్వల్పకాలిక పెట్టుబడుల రాబడి గ్రాఫ్ కంటే కిందకి ఉన్నప్పుడు పెట్టుబడిదారులు భయాందోళనకు గురవుతారు. దీని అర్థం ప్రజలు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడరు. 20 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల పెట్టుబడులు తిరిగి బౌన్స్ అవ్వడానికి తగినంత సమయం ఉంది. యువ పెట్టుబడిదారులకు మాంద్యం అనేది శుభవార్త.

పడిపోతున్న స్టాక్ మార్కెట్ అవకాశాల సముద్రం, ఒకవిధంగా చెప్పాలంటే ఇది ఒక వరం లాంటిది. ప్రతి అసెట్ క్లాస్ కి చైన్ రియాక్షన్ ఉంటుంది, కానీ దీర్ఘకాలిక ప్రభావం పరిమితంగా ఉంటుంది. మార్కెట్లలో పతనం “సేల్” లాంటిది. పడిపోతున్న మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వలన సమ్మేళనం చేసే శక్తి మరింత శక్తివంతమవుతుంది.

యువత తమ లక్ష్యాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఒకసారి మీ ఆర్థిక ప్రణాళికను అమలు చేసిన తర్వాత, మార్కెట్ పరిస్థితి ఎలా ఉన్నా దానికి కట్టుబడి ఉండండి. సక్సెస్ ఫుల్ పెట్టుబడిదారులు కూడా ఏ సమయానికి మార్కెట్లు ఎలా ఉంటాయో చెప్పలేరు. ఆబ్జెక్టివ్-బేస్డ్ ఇన్వెస్టింగ్ అద్భుతాలు చేస్తుంది. ఇది యువ పెట్టుబడిదారుడు కోర్సులో ఉండటానికి, మార్కెట్ పరిస్థితులను విస్మరించడానికి సహాయపడుతుంది. అన్ని సంభావ్య సంక్షోభాలు అసలు సంక్షోభంగా మారవని గుర్తుంచుకోండి.

ఒకవేళ ప్రపంచం మాంద్యం దిశగా పయనిస్తున్నా లేదా మార్కెట్లు 50 శాతం కుప్పకూలినా 30 సంవత్సరాల తరువాత దాని ప్రభావం ఉండదు. ఉదాహరణకు ఒక వ్యక్తి దీర్ఘకాలంలో ఒక చిన్న మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టినట్లయితే, స్వల్పకాలిక సంక్షోభం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. రెండవ ప్రపంచ యుద్ధంలో, యూఎస్ స్టాక్ మార్కెట్ పతనమైనప్పటికీ, విచ్ఛిన్నం కాలేదు. సంక్షోభం అనేది పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ సమయం అనే దానికి ఇది ఒక సజీవ సాక్ష్యం.

సాధారణంగా వ్యక్తి వయస్సు పెరిగే కొద్దీ, సమయం అతనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అదే యుక్త వయస్సులో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది, కావున వారు ప్రయోజనాన్ని పొందుతారు. మంచి రాబడిని సంపాదించేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని అధిగమించడమే పెట్టుబడి లక్ష్యం. సరైన ప్రణాళికతో, ప్రమాదాన్ని కొంత వరకు తగ్గించడం సాధ్యమవుతుంది. బుల్ మార్కెట్లో, అధిక విలువైన స్టాక్ కూడా చౌకగా కనిపిస్తుంది. బేర్ మార్కెట్లకు కూడా ఇది వర్తిస్తుంది. పడిపోతున్న మార్కెట్లో, తక్కువ విలువగల స్టాక్ కూడా ఎక్కువ ధరలా కనిపిస్తుంది. పెట్టుబడిదారుడు తన పెట్టుబడులను ఎల్లప్పుడూ రీ బ్యాలన్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా అస్థిరతకు భయపడితే, రిస్క్-అవెర్సె, ఇంటరెస్ట్-బేరింగ్ బాండ్ లేదా డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు.

దీర్ఘకాలికంగా ఆలోచించడమే విజయానికి కీలకం. అస్థిరత కాలంలో, వార్తా ప్రపంచం నుంచి విరామం తీసుకోవడం మంచిది. గతంలో మార్కెట్లు అనేక మాంద్యాలను చూశాయి, కానీ ప్రతిసారీ అవి మరింత బలం పుంజుకున్నాయి. యువ పెట్టుబడిదారులు ఇలాంటి మనస్తత్వాన్ని అవలంబించుకోవాలి. వార్తలకు దూరంగా ఉండటానికి బదులుగా, వారు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని