డ‌బ్బుతో స‌మ‌యం, సంతోషం కొనుగోలు చేయ‌వ‌చ్చా?

జీవనశైలి అంశాలు స్వల్పకాలిక ఆనందాన్ని ఇస్తాయి. అనుభవాలు దీర్ఘకాలిక ఆనందాన్ని ఇస్తాయి 

Published : 20 Jul 2021 13:42 IST

డబ్బు ఆనందాన్ని కొనగలదా?  ఆర్థిక స్వేచ్ఛ,  డబ్బు సమయాన్ని కొనుగోలు చేయగలదని, ఆనందాన్నిపొందేలా చేయ‌గ‌ల‌ద‌ని కొంత‌మంది న‌మ్ముతున్నారు. కానీ దానికోసం డ‌బ్బును ఎలా ఉప‌యోగించుకుంటున్నార‌నే దానిపై ఆధార‌ప‌డి ఉంటుంది.
తక్కువ వ్యవధిలో అత్యధిక రాబడిని ఇవ్వగల "ఉత్తమ" పెట్టుబడి ప‌థ‌కం ఏదో తెలుసుకోవ‌డం కోసం పెట్టుబడిదారులు చాలా సమయాన్ని వెచ్చిస్తారు. మార్కెట్లు పెరుగుతున్నాయ‌నే కార‌ణంతో ఈక్విటీ మార్కెట్ల గురించి పూర్తిగా తెలుసుకోకుండానే పెట్టుబ‌డుల‌కు సిద్ధ‌మ‌వుతారు.
ఈ పెట్టుబ‌డుల నిర్వ‌హ‌ణ సొంతంగా చేయ‌డం సాధ్య‌మ‌వుతుందా లేదా అని వారు ఆలోచించ‌రు. లావాదేవీల ఖర్చులు, పన్ను వివ‌రాల‌పై కూడా వారికి స‌రైన అవ‌గాహ‌న ఉండ‌దు. దానికంటే 1.5-2 శాతం ఛార్జీల‌తో మ్యూచువల్ ఫండ్‌కు డబ్బు నిర్వహణను వదిలివేయడం లేదా మీ ఆర్థిక జీవితాన్ని నిర్మించగల ఫైనాన్షియల్ ప్లానర్‌తో పనిచేయడం మంచిది కాదా?

ప్ర‌స్తుతం పెరుగుతున్న ప‌థ‌కాల‌లో స్వ‌యంగా పెట్టుబడి పెట్టడం లేదా సరైన కేటాయింపు లేకుండా ఎవ‌రో చెప్పిన  సూచనలను అనుసరించడం త‌ర్వాత భారీ మూల్యానికి దారితీస్తుంది.  ఆర్థిక జీవితాలను ప్లాన్ చేస్తున్నప్పుడు, పెట్టుబడిదారులు తమకు ఆనందాన్నిచ్చే విషయాలపై డబ్బును ఎలా బాగా ఉపయోగించుకోగలుగుతారు. ఈ విషయాల కోసం సమయాన్ని వృథా చేయ‌కుండా డబ్బును ఎలా ఉపయోగించవచ్చనే దానిపై ఆలోచించాలి.
 
సమయం, ఆనందాన్ని కొనడానికి మీరు మీ డబ్బును ఎలా ఉపయోగించుకోవచ్చు?
 డబ్బు మీకోసం ప‌నిచేయాలి:
 మీరు మీ ఖ‌ర్చుల‌ను, ప్ర‌ణాళిక‌ను మొత్త‌న్ని ఒక‌సారి స‌మీక్షించుకొని మీ అన్ని పెట్టుబడుల జాబితాను రూపొందించండి. వేర్వేరు చోట్ల పెట్టుబడులు ఉంటే, చిన్నవి , అధిక-రిస్క్ పెట్టుబడులను ఉప‌సంహ‌రించుకోండి. పెట్టుబ‌డులు ఉన్న ప‌థ‌కాల్లోని  నష్టాలను అంచనా వేయండి.  రిస్క్ సామ‌ర్ధ్యానికి మించి ఉంటే నిష్క్ర‌మించండి. మీ స‌మ‌యాన్ని ఆదా చేయ‌డానికి మీకు త‌గిన పెట్టుబ‌డి ప‌థ‌కాల‌ను ఆర్థిక స‌ల‌హాదారుని అడిగి తెలుసుకోండి.

మీకు తెలిసీ, తెలియ‌కుండా మీరు ఎన్నో ఖ‌ర్చులు చేస్తారు. మ‌రి మీ ఆర్థిక ప్ర‌ణాళిక‌ను మెరుగుప‌రుచునేందుకు ఆర్థిక స‌ల‌హాదారుడి కోసం కొంత మొత్తం కూడా ఖ‌ర్చు చేయ‌లేరా దీంతో మీ స‌మ‌యంతో పాటు రిస్క్ త‌క్కువ‌గా ఉంటుంది. జీవితాన్ని సంతోషంగా గ‌డ‌ప‌వ‌చ్చు.
 డబ్బును ఎలా బాగా ఉపయోగించవచ్చో జాబితాను రూపొందించండి:
 మీకు సంతోషాన్నిచ్చే ప్ర‌యాణాలు వంటివాటికోసం ఖ‌ర్చు చేస్తే మ‌న‌సుకు సంతోషాన్నిస్తుంది. అయితే ఇత‌రులు చెప్పార‌ని ల‌గ్జ‌రీ వ‌స్తువులు, అవ‌స‌రం లేని వ్య‌యాలు చేయ‌కూడ‌దు. మీ ఖ‌ర్చులపై విచ‌క్ష‌ణ క‌లిగి ఉండాలి. జీవనశైలి అంశాలు స్వల్పకాలిక ఆనందాన్ని ఇస్తాయి, అనుభ‌వాన్ని ఇస్తాయి.

డబ్బుతో ప్రతిదీ కొనలేకపోవచ్చు, కానీ అది మీకు మంచి జీవితాన్ని ఇవ్వ‌గ‌ల‌దు.  మంచి జ్ఞాపకాలు, అనుభ‌వాలు ఇవ్వ‌డంలో సహాయపడుతుంది, ఇది ఆనందాన్ని కనుగొనడం చాలా సులభం చేస్తుంది.  ఇప్ప‌టినుంచి పెట్టుబడి పెట్టేట‌ప్పుడు ఆ ప‌థ‌కం మీరు అర్ధవంతమైన జీవితాన్ని గ‌డిపేందుకు ఎలా సహాయ‌ప‌డుతుందనే విష‌యాన్ని దృష్టిలో పెట్టుకోండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని