YouTube: వీడియోలో నచ్చిన కంటెంట్ చూసేందుకు యూట్యూబ్ కొత్త ఫీచర్!
యూట్యూబ్‌లో వీడియోలో తమకు కావాల్సిన కచ్చితమైన అంశం గురించి వెతికేందుకు కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో యూజర్ల సమయం ఆదా అవుతుందని గూగుల్ చెబుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాం యూట్యూబ్ (YouTube) కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరియం చేయనుంది. దిల్లీలో జరుగుతున్న గూగుల్ ఫర్ ఇండియా 2022 (Google For India 2022) కార్యక్రమంలో కొత్త ఫీచర్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. సెర్చ్ ఇన్ వీడియో (Search in Video) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్లు వీడియోలో తమకు నచ్చిన అంశం గురించి సులువుగా వెతకొచ్చని యూట్యూబ్ చెబుతోంది.
యూట్యూబ్‌లో యూజర్ దిల్లీ గురించిన వీడియో చూస్తున్నారు. అందులో దిల్లీలోని ఎర్రకోట (Redfort) ఎలా ఉందో చూడాలనుకుంటే..? వీడియోలో కుడివైపు కింద భాగంలో సెర్చ్‌బార్ ఆప్షన్‌పై క్లిక్ చేసి రెడ్‌ఫోర్ట్ అని టైప్ చేస్తే.. వీడియోలో దానికి సంబంధించిన విజువల్స్‌ను చూపిస్తుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్‌కు కావాల్సిన కంటెంట్ సులువుగా వెతకడంతోపాటు, సమయం ఆదా అవుతుందని గూగుల్ భావిస్తోంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న వీడియో త్వరలోనే సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ ఫీచర్‌తోపాటు యూట్యూబ్ మల్టీసెర్చ్ (Multisearch) ఫీచర్‌ను కూడా తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీంతో యూజర్లు సెర్చ్ ఇన్ వీడియో చేసేప్పుడు ఫొటో, స్క్రీన్‌షాట్ ద్వారా వెతకడంతోపాటు, సందేహాలకు సంబంధించిన ప్రశ్నలను తమకు అనువైన భాషలో అడగొచ్చు. ఇవేకాకుండా బైలింగ్వల్ సెర్చ్ రిజల్ట్ (Bilingual Search result) అనే ఫీచర్‌ను కూడా పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో యూజర్ ఆంగ్లంలో ప్రశ్నను అడిగి తెలుగులో సమాధానం పొందొచ్చు. ముందుగా ఈ ఫీచర్‌ను హిందీ భాషలో పరిచయం చేయనున్నారు. తర్వాత తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో తీసుకురానున్నట్లు గూగుల్ వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
APSRTC: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ
-
Sports News
Asia Cup 2023: ‘వారు నరకానికి పోవాలనుకోవడం లేదు’’..: వెంకటేశ్ ప్రసాద్
-
General News
KTR: హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
General News
Supreme Court: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. అత్యవసర విచారణకు సీజేఐకి విజ్ఞప్తి
-
World News
Mumbai terror attacks: 2008 ఉగ్రదాడి గాయం గుర్తులు ఇంకా మానిపోలేదు: అమెరికా
-
Politics News
Balasaheb Thorat: మహారాష్ట్రలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్.. పార్టీ పదవికి థోరట్ రాజీనామా!