Zepto: లింక్డిన్‌ ర్యాంకింగ్స్‌.. టాప్‌ ఇండియన్‌ స్టార్టప్‌గా జెప్టో

Zepto: ఇటీవల యూనికార్న్‌గా అవతరించిన ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ జెప్టో ఇప్పుడు మరో ఘనత సాధించింది. భారత్‌లోనే టాప్‌ స్టార్టప్‌గా నిలిచింది.

Published : 27 Sep 2023 15:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల యూనికార్న్‌గా అవతరించిన ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ జెప్టో (Zepto) మరో ఘనత సాధించింది. ఎక్కువ మంది ఇష్డపడే వర్క్‌ప్లేస్‌ల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. లింక్డిన్‌ తాజాగా విడుదల చేసిన టాప్‌ 25 అంకుర సంస్థల జాబితాలో టాప్‌ స్టార్టప్‌గా నిలిచింది.

ఎంప్లాయిమెంట్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ అయిన లింక్డిన్‌ (LinkedIn) బుధవారం ‘టాప్ 25 ఇండియన్ స్టార్టప్‌’ల పేరిట జాబితా విడుదల చేసింది. నిపుణులు పని చేయాలనుకునే అంకుర సంస్థలకు యాన్యువల్‌ ర్యాంక్స్‌ ఇచ్చింది. అందులో జెప్టో ఫస్ట్‌ ర్యాంక్‌ని సాధించింది. ఉద్యోగంలో ఎదుగుదల, ఉద్యోగార్థుల ఆసక్తి, సంస్థలో ఉద్యోగుల మధ్య సుహృద్భావ వాతావరణం వంటి కారణాలతో జెప్టో ఈ స్థానంలో నిలిచింది. దీంతో గతేడాది నాలుగో స్థానంలో ఉన్న ఈ స్టార్టప్‌ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని అగ్రగామిగా నిలిచింది.

అందులో మా తప్పేం లేదు.. ఎయిర్‌బ్యాగ్‌ల కేసుపై మహీంద్రా వివరణ

జెప్టో తర్వాత స్థానాల్లో ఈవీ క్యాబ్ అగ్రిగేటర్ బ్లూస్మార్ట్, ఫిన్‌టెక్ కంపెనీ డిట్టో ఇన్సూరెన్స్, ఆడియో ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్ పాకెట్ FM, స్కైరూట్ ఏరోస్పేస్ ఉన్నాయి. ‘ఈ ఏడాది జాబితాలో ఉన్న 20 అంకుర సంస్థల్లో 14 కొత్త స్టార్టప్‌లు కావటం విశేషం. ఇది దేశంలో స్టార్టప్‌ రంగంలో ఉన్న అపారమైన సామర్థ్యానికి అద్దంపడుతోంది’ అని లింక్డిన్‌ ఇండియా ఎడిటోరియల్‌ హెడ్‌ నిరజితా బెనర్జీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని