Zerodha: జెరోదాలో మళ్లీ సాంకేతిక సమస్య.. సోషల్‌ మీడియా వేదికగా యూజర్ల అసహనం!

Zerodha: జెరోదాలో సోమవారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో యూజర్లు తమ అసహనం వ్యక్తంచేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

Published : 08 Jul 2024 13:38 IST

దిల్లీ: ప్రముఖ స్టాక్‌ బ్రోకరేజ్‌ ప్లాట్‌ఫామ్‌ జెరోదాలో (Zerodha) మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో యూజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ దృష్టికి తీసుకెళ్లేందుకు సోషల్‌ మీడియా వేదికగా తమ అసహసనాన్ని వెలిబుచ్చుతున్నారు.

యాప్‌లో సోమవారం ఉదయం ప్లేస్‌ చేసిన ఆర్డర్లు ఎగ్జిక్యూట్‌ కాలేదని జెరోదా (Zerodha) యూజర్లు ఫిర్యాదు చేశారు. క్యాన్సిల్ చేసి డబ్బు వాపస్‌ తీసుకోవడానికీ వీలు కాలేదని తెలిపారు. ఆర్డర్‌ ప్రాసెసింగ్‌లో ఉన్నందున డబ్బు ఉపసంహరించుకోలేరని చూపినట్లు వివరించారు. వీటికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను యూజర్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో #Zerodha కీవర్డ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?

సాంకేతిక సమస్య తలెత్తినట్లు జెరోదా (Zerodha) సైతం ధ్రువీకరించింది. తమ యూజర్లలో కొంతమంది ఆర్డర్‌ స్టేటస్‌ను కొంతసేపు తెలుసుకోలేకపోయారని తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించామని వెల్లడించింది. ఇప్పుడంతా సజావుగానే సాగుతోందని తెలిపింది. సమస్య తలెత్తిన ఆర్డర్ల స్టేటస్‌లను అప్‌డేట్‌ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సమస్యపై విచారం వ్యక్తంచేసిన సంస్థ.. యూజర్లకు క్షమాపణలు చెప్పింది.

గత తొమ్మిది నెలల్లో జెరోదాలో (Zerodha) ఇలా సాంకేతిక సమస్యలు తలెత్తడం ఇది ఆరోసారి. జూన్‌లో యూజర్లు రెండుసార్లు సమస్యను ఎదుర్కొన్నారు. కొన్నిసార్లయితే, అసలు యాప్‌ పనిచేయకుండా పోయింది. జూన్‌ 3న మార్కెట్లు రికార్డు గరిష్ఠాల వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. ఆరోజు కూడా జెరోదాలో సమస్య తలెత్తింది. దీంతో యాప్‌ పనితీరుపై యూజర్లు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని