Zomato: జొమాటోలో ఉద్యోగాల కోత.. 3 శాతం మందికి ఉద్వాసన!

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో ఉద్యోగులను తొలగించే పనిని ప్రారంభించింది. మొత్తం ఉద్యోగుల్లో 3 శాతం మేర మందిని ఇంటికి పంపిస్తోంది.

Published : 19 Nov 2022 17:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో (Zomato) ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం ఉద్యోగుల్లో 3 శాతం మేర మందిని ఇంటికి పంపించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, వివిధ విభాగాలకు చెందిన దాదాపు 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఉద్యోగాల తొలగించడంపై కంపెనీ సైతం ధ్రువీకరించింది. ఏటా చేపట్టే పనితీరు ఆధారిత మదింపు ప్రక్రియలో భాగంగానే మూడు శాతం తొలగిస్తున్నామని, అంతకు మించి ఏమీ లేదని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. జొమాటోలో ప్రస్తుతం 3,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో జొమాటో నష్టాలు కొంతమేర తగ్గాయి. గతేడాది రెండో త్రైమాసికంలో రూ.430 కోట్లుగా ఉన్న నష్టాలు రూ.251 కోట్లకు దిగి వచ్చాయి. ఈ క్రమంలోనే ఖర్చులను తగ్గించుకుని కంపెనీని లాభయదాకయకత సాధించడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీ ఉద్యోగుల తొలగింపు చేపట్టినట్లు తెలుస్తోంది. అంతకుముందు 2020 మే నెలలో కరోనా సమయంలో దాదాపు 500 మందికి పైగా ఉద్యోగులను జొమాటో తొలగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు