- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Zomato: సమస్యను పరిష్కరించకపోతేనే రెస్టారెంట్లపై నిషేధం: జొమాటో
దిల్లీ: కొత్తగా తీసుకువచ్చిన ఆహార నాణ్యతా విధానం ఏకపక్షంగా ఉందన్న రెస్టారెంట్ల ఆందోళనలపై జొమాటో స్పందించింది. ఈనెల 18 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ విధానాన్ని మే 3నకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. కొత్త విధానంపై జాతీయ రెస్టారెంట్ల సంఘం(ఎన్ఆర్ఏఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా జొమాటో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఏప్రిల్ 22 వరకు కొత్త విధానంపై తమ అభిప్రాయాలను తెలపాలని రెస్టారెంట్లను జొమాటో కోరింది.
కొత్త విధానం ప్రకారం అందే ఫిర్యాదులు చాలా తక్కువే ఉండే అవకాశం ఉందని జొమాటో తెలిపింది. అయితే, వీటిని పరిష్కరించకపోతే దీర్ఘకాలంలో వినియోగదారుల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. అందిన ఫిర్యాదుల్లో వాస్తవమెంతో తెలుసుకునేందుకు కావాల్సిన వ్యవస్థను ఏర్పరచేందుకు రెస్టారెంట్లతో కలిసి పనిచేస్తామని తెలిపింది. నిర్దిష్ట సమయంలోగా సరైన పరిష్కారం చూపని రెస్టారెంట్లను మాత్రమే తమ యాప్‌లో తాత్కాలికంగా నిషేధిస్తామని వివరించింది.
ఇదీ విధానం..
‘ఆహార నాణ్యతపై వినియోగదార్ల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా తాత్కాలికంగా తమ ప్లాట్‌ఫాంలో ఆయా రెస్టారెంట్లను నిషేధిస్తామని’ వివరిస్తూ రెస్టారెంట్లకు జొమాటో ఇ-మెయిళ్లు పంపింది. ఆ రెస్టారెంట్లలోని పదార్థాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి ఉండే థర్డ్‌పార్టీ తనిఖీలను జరిపేంత వరకు ఈ తాత్కాలిక నిషేధం కొనసాగుతుందని.. ఇందుకయ్యే ఆడిట్ ఖర్చు కూడా రెస్టారెంట్లే భరించాలని జొమాటో తెలిపింది. ఫిర్యాదులో నిజమెంతో ఎలా తెలుస్తుందని ఎన్ఆర్ఏఐ ప్రశ్నిస్తూ కొత్త విధానంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nara lokesh: జగన్‌వి.. పదో తరగతి పాస్.. డిగ్రీ ఫెయిల్ తెలివితేటలు: నారా లోకేశ్
-
Sports News
Test Captain : భావి భారత టెస్టు కెప్టెన్‌గా అతడికే ఎక్కువ అవకాశం: టీమ్ఇండియా మాజీ ఆటగాడు
-
India News
Swine flu: ముంబయిలో స్వైన్‌ఫ్లూ విజృంభణ.. 15రోజుల్లో ఎన్నికేసులంటే?
-
General News
Telangana News: నాగార్జునసాగర్ డ్యామ్‌పై ప్రమాదం.. విరిగిన క్రస్ట్‌గేట్ ఫ్యాన్
-
Movies News
Social Look: ఆకుపచ్చ చీరలో అనసూయ ‘సందడి’.. ప్రియాంక చోప్రా సర్ప్రైజ్!
-
Politics News
Karnataka: మంత్రి ఆడియో లీక్ కలకలం.. సీఎం బొమ్మైకి కొత్త తలనొప్పి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- Dhanush: ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా?
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- RRR: ఆస్కార్‌కు ‘ఆర్ఆర్ఆర్’.. నామినేట్ అయ్యే ఛాన్స్ ఎంతంటే?
- Ponniyin Selvan: ఆ ఫార్మాట్లో విడుదలవుతున్న తొలి తమిళ సినిమా!
- Hardik : హార్దిక్ ఫుల్ స్వింగ్‌లో ఉంటే భారత్‌ను తట్టుకోలేం: జింబాబ్వే బ్యాటింగ్ కోచ్
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!
- Imram Tahir : తాహిర్‌కు రొనాల్డో పూనాడు.. వికెట్ సంబరం ఎలా చేశాడో చూసేయండి..!