ప్లాస్టిక్‌ కవర్లలో ఆహారం వద్దు.. స్పందించిన జొమాటో సీఈఓ

ఆహారం పార్శిల్‌ చేసినపుడు ప్లాస్టిక్‌ వాడకంపై ఇన్‌స్టా వేదికగా ఓ నిపుణుడు ఆందోళన వ్యక్తంచేశారు. ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లకు ట్యాగ్‌ చేశారు. దీనిపై జొమాటో సీఈఓ స్పందించారు.

Published : 21 Jun 2024 14:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్లాస్టిక్‌ వినియోగం పెరగడంపై చాలాకాలంగా ఆందోళనలు మొదలయ్యాయి. ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఈ ప్లాస్టిక్‌ భూతం గురించి ఎందరో నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇటీవలే లైఫ్‌స్టైల్‌ నిపుణుడు ల్యూక్‌ కౌటిన్హో హాట్‌ ఫుడ్‌ ప్యాకేజింగ్‌ కోసం ప్లాస్టిక్‌ బాక్స్‌లు ఉపయోగించడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. వాటివల్ల కలిగే ప్రమాదాల గురించి తీవ్ర ఆందోళనలు వ్యక్తంచేశారు. అంతే కాదు ఫుడ్‌ డెలివరీలు అందించే సంస్థలను ట్యాగ్‌ చేశారు. 

ప్లాస్టిక్ కవర్లు, బాక్సుల్లో వేడి ఆహారపదార్థాలు వేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని కౌటిన్హో తెలిపారు. ‘‘ఆహారం వేడిగా ఉండాలని ఆర్డర్‌ పెట్టే ప్రతీ యూజర్‌ కోరుకుంటారు. దీంతో రెస్టారంట్లు ఫుడ్‌ను ఎక్కువ వేడి చేసి అలానే ప్లాస్టిక్‌ బాక్స్‌ల్లో అందిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలాంటి ఆహారం తినడం వల్ల అనారోగ్యం బారినపడతారు’’ అని ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేశారు. ఇలాంటి ఫుడ్‌ తీసుకుంటే వచ్చే సమస్యల గురించి ప్రస్తావించారు.

ట్రైన్‌ టికెట్‌పై GNWL30/WL8 ఉంటే దానర్థం ఏమిటి?

ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లను ట్యాగ్‌ చేస్తూ.. ‘‘స్విగ్గీ, జొమాటో, రెస్టారంట్లు, బయోడిగ్రేడబుల్‌ నాన్‌- ప్లాస్టిక్‌ బాక్స్‌ల్లో ఫుడ్‌ డెలివరీలు అందించేలా మీ భాగస్వాములతో కలసి పనిచేయండి. ఇప్పటికే చాలా రెస్టారంట్లు ప్లాస్టిక్‌ వినియోగించకుండానే ఫుడ్‌ ఆర్డర్లు అందిస్తున్నాయి. ఈ మార్పు తెచ్చే సత్తా మీకుంది’’ అని రాసుకొచ్చారు. దీనిపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్  (Deepinder Goyal) స్పందించారు. ‘‘ఇలాంటి ఆలోచన తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నాన్‌- ప్లాస్టిక్‌ వైపు మారేందుకు ప్రయత్నం చేస్తాం. ఇకపై సురక్షితమైన ఆహార ప్యాకేజింగ్‌ అందించే రెస్టారంట్లను హైలైట్‌ చేస్తాం. ఇది కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటుంది’’ అని సమాధానమిచ్చారు. అంటే ఇకపై జొమాటోలో ప్యాకింగ్‌ విషయంలోనూ ప్రత్యేక ఎంపికలు ఉండనున్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు