Zomato: డెలివరీ పార్ట్‌నర్స్‌కు సీపీఆర్‌లో శిక్షణ.. జొమాటో గిన్నిస్‌ రికార్డ్‌

Zomato: జొమాటో గిన్నిస్‌ రికార్డ్‌ సొంతం చేసుకుంది. ఒకే వేదికపై పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఫస్ట్‌ ఎయిడ్‌ శిక్షణ అందించిన  ఘనత దక్కించుకుంది.

Updated : 14 Jun 2024 16:32 IST

Zomato | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ కంపెనీ జొమాటో (zomato) అరుదైన రికార్డ్‌ సొంతం చేసుకుంది. అత్యవసర సమయాల్లో ఉన్నవారికి వైద్య సాయం అందించేలా తమ డెలివరీ భాగస్వాములను తీర్చిదిద్దింది. ఒకే వేదికపై 4,300 మంది డెలివరీ పార్ట్‌నర్స్‌కు సీపీఆర్‌ శిక్షణ అందించి గిన్నిస్‌ రికార్డును కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) తెలిపారు. 

‘‘ముంబయిలో నిర్వహించిన ఓ వేదికలో ఏకంగా 4,300 మంది డెలివరీ పార్టనర్స్‌కు ప్రథమచికిత్స ఎలా అందించాలో నేర్పించాం. దీంతో గిన్నిస్‌ రికార్డ్‌ సొంతం చేసుకున్నాం. ప్రస్తుతం జొమాటోలో 30,000 కంటే ఎక్కువ డెలివరీ భాగస్వాములు వైద్యం అందించడానికి, రోడ్‌సైడ్‌ ఎమర్జెన్సీ సమయంలో సాయం అందించడానికి వృత్తిపరంగా శిక్షణ పొందారు’’ అని గోయల్‌ ‘‘ఎక్స్‌’’ వేదికగా పేర్కొన్నారు. దేశంలోని ఎమర్జెన్సీ హీరోలకు సెల్యూట్ అంటూ ముంబయి ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు జత చేశారు.

జులై 22న కేంద్ర బడ్జెట్‌.. జులై 3న ఆర్థిక సర్వే..!

తమ డెలివరీ భాగస్వాములు ప్రథమ చికిత్స, సీపీఆర్‌ (CPR) అందించడానికి వృత్తిపరమైన శిక్షణ పొందినట్లు జొమాటో తన అధికారిక ‘‘ఎక్స్‌’’ ఖాతా ద్వారా పంచుకుంది. అంతేకాదు ఈ శిక్షణ తీసుకున్నవారి బ్యాగ్‌పై గ్రీన్‌ కలర్‌ ‘‘+’’ చిహ్నం ఉంటుందని పేర్కొంది. జొమాటో చేపట్టిన చర్యపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘చాలా గొప్ప ప్రయత్నం’, ‘ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నందుకు అభినందనలు’, ‘డెలివరీ పార్ట్‌నర్స్‌కు మీరు ఇచ్చిన శిక్షణ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు