కీలక నేత సహా ఏడుగురు ఉగ్రవాదుల హతం

జమ్మూ కశ్మీర్‌లో రెండు వేర్వేరే చోట్ల సైనికులు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. మృతుల్లో ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రధాన నేత కూడా ఉన్నట్లు సమాచారం....

Published : 10 Apr 2021 01:16 IST

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో రెండు వేర్వేరు చోట్ల సైనికులు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు ముష్కరులు హతమయ్యారు. మృతుల్లో ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రధాన నేత కూడా ఉన్నట్లు సమాచారం. గురువారం రాత్రి షోపియన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, సైనికులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో ఐదుగురు ముష్కరులు హతమైనట్లు, నలుగురు సైనికులు కూడా గాయపడినట్లు కశ్మీర్‌ జోన్‌ పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఘజ్వత్‌ ఉల్‌ హింద్‌ ఉగ్రవాద సంస్థ నేత ఇంతియాజ్‌ షా ఉన్నట్లు పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం పుల్వామా జిల్లాలోనూ సైన్యం, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఆ రెండు జిల్లాల్లో ఇంటర్నెట్‌ సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని