
ట్రక్కు బోల్తా.. 10మంది జవాన్లకు గాయాలు
గిరిధ్: ఝార్ఖండ్‌లోని గిరిధ్ జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రోడ్డుపై పశువులు అడ్డంగా రావడంతో వాహనం అదుపు తప్పి ఈ ప్రమాదం సంభవించింది.
సీఆర్పీఎఫ్ 154వ బెటాలియన్‌కు చెందిన 25 మంది జవాన్లను మదుబన్ నుంచి నిమియా ఘాట్‌కు తరలిస్తుండగా మదుబన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనానికి పశువుల గుంపు అడ్డుగా రావడంతో వాటిని తప్పించేందుకు డ్రైవర్ యత్నించాడు. ఈ క్రమంలో వాహనం బోల్తా పడింది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం ఎయిర్‌లిఫ్ట్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.