తొక్కిసలాటలో 11 మంది మహిళల మృతి

ఆఫ్గనిస్థాన్‌లో జరిగిన ఓ తొక్కిసలాటలో 11 మంది మహిళలు మృతిచెందారు. నంగర్‌హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పు ప్రావిన్స్‌లోని పాకిస్థాన్ కాన్సులేట్ వద్ద...

Published : 22 Oct 2020 01:18 IST

కాబుల్‌: ఆఫ్గనిస్థాన్‌లో జరిగిన ఓ తొక్కిసలాటలో 11 మంది మహిళలు మృతిచెందారు. నంగర్‌హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పు ప్రావిన్స్‌లోని పాకిస్థాన్ కాన్సులేట్ వద్ద వీసాల దరఖాస్తు కోసం ఓ స్టేడియంలో బుధవారం వేలాది మంది గుమిగూడారు. అయితే, ఆ స్టేడియం నుంచి బయటకువచ్చే క్రమంలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మహిళలు మరణించారు. మరో 8 మంది మహిళలతోపాటు ఇద్దరు పురుషులు గాయడినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని