Tragedy: కల్తీ మద్యం తాగి 11మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌ అలీగఢ్‌ పరిధిలోని కర్సువాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యంతాగి 11మంది మృతిచెందారు. మరో ఐదుగురు అస్వస్థతకు

Updated : 28 May 2021 16:14 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ అలీగఢ్‌ పరిధిలోని కర్సువాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యంతాగి 11మంది మృతిచెందారు. మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. ఒకే యజమానికి చెందిన రెండు దుకాణాల్లో బాధితులు మద్యం తాగినట్టు గుర్తించిన అధికారులు.. ఆ దుకాణాలను సీజ్‌ చేశారు.

కల్తీ మద్యం తాగి ఇద్దరు మృతిచెందినట్లు లోధా పోలీసులకు తొలుత ఫిర్యాదు అందింది. ఘటనా ప్రాంతానికి చేరుకొని విచారణ చేపట్టగా.. కర్సువా గ్రామంతోపాటు పరిసర గ్రామాల్లోని కల్తీ మద్యం తాగి మొత్తం 11 మంది మృతిచెందినట్లు తేలింది. ఆయా గ్రామాలకు అదనపు పోలీసు సిబ్బంది చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు లోధా డీఐజీ దీపక్‌ కుమార్‌ వెల్లడించారు. ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ డి.శర్మ మాట్లాడుతూ.. అస్వస్థతకు గురైన ఐదుగురిని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించామని, మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కల్తీ మద్యం విక్రయించిన రెండు దుకాణాలను సీజ్‌ చేశామని, పరీక్షల కోసం మద్యం నమూనాలను సేకరించినట్లు వెల్లడించారు. గురువారం నుంచే పలువురు అస్వస్థకు గురయ్యారని, చుట్టుపక్కల గ్రామాల్లోని చాలా మంది ఆ మద్యాన్ని తాగినట్లు స్థానికులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని