Gujarat: ఘోర ప్రమాదం.. ఫ్యాక్టరీ గోడ కూలి 12మంది దుర్మరణం

గుజరాత్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. మోర్బి జిల్లా హల్వాద్‌లోని ఓ ఉప్పు ఫ్యాక్టరీ......

Updated : 18 May 2022 14:49 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. మోర్బి జిల్లా హల్వాద్‌లోని ఓ ఉప్పు ఫ్యాక్టరీ గోడ కూలడంతో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 12మంది కార్మికులు దుర్మరణం చెందారు. దాదాపు 30మందికిపైగా కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి బ్రిజేశ్‌ మెజ్రా స్పందించారు. మృతుల కుటుంబాలు ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.

మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం: పీఎంవో

ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించాలని సూచించారు. మరోవైపు, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పీఎంఎన్ఆ‌ర్‌ఎఫ్‌ నుంచి రూ.2లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) వెల్లడించింది. క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున సాయం ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని