spurious liquor: కల్తీ మద్యంతో 12 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం..

తమిళనాడులో కల్తీ మద్యం తాగి 12 మంది మృత్యువాతపడ్డారు. దాదాపు 25 మంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో ఈ కల్తీ మద్యం కలకలం సృష్టించింది.

Published : 15 May 2023 11:09 IST

చెన్నై: తమిళనాడులో కల్తీ మద్యం తాగి 12 మంది మృత్యువాతపడ్డారు. దాదాపు 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో ఈ కల్తీ మద్యం కలకలం సృష్టించింది. పోలీసుల కథనం మేరకు.. విల్లుపురం జిల్లా మరక్కాణం ప్రాంతానికి చెందిన అమరన్‌ సముద్ర తీరంలో ఉన్న వంబామేడు ప్రాంతంలో సారాయి విక్రయిస్తుంటాడు.

అతడి వద్ద ఎక్కియార్‌కుప్పం జాలరి గ్రామానికి చెందిన కొందరు ఆదివారం మద్యం తాగారు. వారిలో కొంత మంది ఇంటికి వెళ్లిన వెంటనే స్పృహ కోల్పోయారు. కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో పలువురు చికిత్స పొందుతూనే మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పోలీసులు అమరన్‌ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని