Inflammatory posts: సోషల్‌ మీడియాలో తాలిబన్లకు మద్దతు.. అస్సాంలో 14 మంది అరెస్టు

తాలిబన్లకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, కామెంట్లు పెట్టిన పలువురిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి నుంచి ఇప్పటివరకు 14 మందిని అదుపులోకి తీసుకొని....

Published : 21 Aug 2021 19:00 IST

గువాహటి: అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు అక్కడ తమ అరాచక పాలనకు నాంది పలికారు. మహిళా హక్కులను కాలరాస్తున్నారు. తమను వ్యతిరేకిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ఆ తాలిబన్లకు భారత్‌లోని కొందరు మద్దతు పలుకున్నారు. తాలిబన్లకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, కామెంట్లు పెట్టిన పలువురిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి నుంచి ఇప్పటివరకు 14 మందిని అదుపులోకి తీసుకొని వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అస్సాంకు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఉద్రేకపూరిత పోస్టులపై నిఘా ఉంచామని పేర్కొన్నారు. ఈ తరహా పోస్టులు పెట్టిన కామ్‌రూప్‌ మెట్రోపాలిటన్‌, బార్పేట్‌, ధుబ్రి, కరీంగంజ్‌ నుంచి ఇద్దరు చొప్పున అరెస్టు చేశామని పేర్కొన్నారు. దర్రాంగ్‌, కాచర్‌, హైలాకండి, దక్షిణ సల్మారా, గోల్‌పారా, హొజాయ్‌ ప్రాంతాల నుంచి ఒక్కొక్కరి చొప్పున అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. దేశ భద్రతకు హాని కలిగించేలా సోషల్ మీడియాలో తాలిబన్ అనుకూల వ్యాఖ్యలు, పోస్టులపై చట్టపరమైన, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని