
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది సజీవ దహనం
ఇంటర్నెట్ డెస్క్: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సెంట్రల్ మెక్సికోలోని రహదారిపై టోల్బూత్ వద్ద ఆపిన వాహనాలపైకి.. ఓ రవాణా ట్రక్కు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగడంతో తొమ్మిది వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల్లో చిక్కుకుని 15 మంది సజీవ దహనమయ్యారు. ట్రక్కు బ్రేకులు విఫలం కావడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.