1500 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో పోలీసులు భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు....

Published : 05 Dec 2020 00:59 IST

షిల్లాంగ్‌: ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో పోలీసులు భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జైంతియా జిల్లాలోని కాంగోంగ్‌ చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన సోదాల్లో 250 కిలోల పేలుడు పదార్థాలు (2000 జిలెటిన్‌ స్టిక్స్‌), 1000 లైవ్‌ డిటోనేటర్లను కారులో తరలిస్తూ ఇద్దరు నిందితులు చిక్కారు.

నిందితుల సమాచారంతో క్లేరియట్‌ అనే ప్రాంతంలో సోదాలు నిర్వహించిన పోలీసులు భారీగా పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో 1,275 కిలోల పేలుడు పదార్థాలు సహా మరో 5000 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్‌ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ జీకే లాంగ్రాయ్‌ వెల్లడించారు. మరో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని