UP: 35కు చేరిన కల్తీ మద్యం మృతులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కర్సువాలో కల్తీ మద్యం తాగి మృతి చెందినవారి సంఖ్య 35కు చేరింది. చికిత్స పొందుతున్న మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని..మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Updated : 22 Dec 2022 14:41 IST

చికిత్స పొందుతూ మరో 24 మంది మృతి

అలీగఢ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కర్సువాలో కల్తీ మద్యం తాగి మృతి చెందినవారి సంఖ్య 35కు చేరింది. చికిత్స పొందుతున్న మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని..మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అలీగఢ్‌ పరిధిలోని కర్సువా ప్రాంతంలోని ప్రభుత్వం ఆమోదం పొందిన రెండు దుకాణాల్లో మద్యం కొని సేవించిన పలువురు అస్వస్థకు గురయ్యారు. పరిస్థితి విషమించి ఇప్పటివరకు 35 మంది మృతి చెందారు. ఈ మరణాలపై యూపీ ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విధి నిర్వహణలో అలసత్వం వహించిన జిల్లా ఎక్సైజ్‌ అధికారితోపాటు, మరో ఐదుగురు అధికారులను సస్పెండ్‌ చేసింది. 

కల్తీ మద్యం తాగి ఇద్దరు మృతి చెందినట్లు, పలువురు అస్వస్థకు గురైనట్లు లోధా పోలీసులకు శుక్రవారం తొలుత ఫిర్యాదు అందింది. ఘటనా ప్రాంతానికి చేరుకొని విచారణ చేపట్టగా.. కర్సువా గ్రామంతోపాటు పరిసర 3 గ్రామాల్లో మొత్తం 11 మంది మృతి చెందినట్లు తేలింది. ఆయా గ్రామాలకు అదనపు పోలీసు సిబ్బంది చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అస్వస్థకు గురైన పలువురిని ఆసుపత్రుల్లో చేర్చారు. కాగా అందులో శుక్రవారం ఐదుగురు, శనివారం మరో 19 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. మరికొందరు కంటిచూపు కోల్పోయినట్లు తెలుస్తోంది.

విచారణ చేపట్టిన పోలీసులు కల్తీ మద్యం విక్రయించిన రెండు దుకాణాలను సీజ్‌ చేసి, పరీక్షల కోసం మద్యం నమూనాలను సేకరించినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్యం విక్రయించిన ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారిపై రూ.లక్ష రివార్డును ప్రకటించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని