Crime news: పీవోకేలో  ఘోర ప్రమాదం.. 22మంది మృతి

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 22మంది దుర్మరణం చెందగా.......

Published : 04 Nov 2021 01:36 IST

ఇస్లామాబాద: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 22మంది దుర్మరణం చెందగా.. మరో ఏడుగురికి గాయాలైనట్టు పోలీసులు వెల్లడించారు. సుధోంటి జిల్లా బలోచ్‌ ప్రాంతం నుంచి పంజాబ్‌ ప్రావిన్స్‌లోని రావల్పిండి వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సులో తలెత్తిన సాంకేతిక సమస్యతో రోడ్డు నుంచి 500 మీటర్ల లోతులోకి పడిపోయినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్టు వెల్లడించారు.

సమీపంలో ఉన్న రోడ్డు పక్కన వ్యాపారి ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే అక్కడే ఉన్న ఓ మత పెద్దకు ఫోన్‌లో సమాచారం ఇచ్చినట్టు డాన్‌ పత్రిక పేర్కొంది. మత గురువు ఈ ప్రమాదం గురించి మసీదులో మైకులో ప్రకటించారనీ.. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని కోరారని పేర్కొంది. పీవోకే ప్రమాదకరమైన రహదారులతో కూడిన పర్వత ప్రాంతం. డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల్లో సమస్యల కారణంగా ఇక్కడ తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. గత నెలలో పాక్‌ ఆక్రమిత ప్రాంతంలోని పూంచ్‌, నీలమ్‌ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు విద్యార్థులతో పాటు కొందరు ప్రయాణికులు మృతిచెందగా.. 32 మంది గాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని